పవన్ బిగ్ డెసిషన్- ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలని తెలి పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి పోటీ చేసే హక్కు ఉంటుందని.. పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చని వెల్లడించారు.

పంచాయితీ ఎన్నికల్లో ఎక్కడైనా జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయవచ్చంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి రాజకీయపరమైన అడ్డంకులు ఉండవంటూ స్పష్టం చేశారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఉన్నట్టు.. పంచాయతీ ఎన్నికల్లో సర్దుబాట్లు, సీట్ల పంపకాలు ఉండవని తేల్చిచెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు ఎవరైనా నామినేషన్ వేయవచ్చంటూ తేల్చి చెప్పారు. మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన నేతలు కోరుకున్న స్థానాల్లో పోటీకి అవకాశం దక్కలేదు. దీంతో... పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోవద్దని ఆదేశించారు.

పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు, సమృద్ధిగా వర్షాలు ఇక అప్పుడే..!!
పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు, సమృద్ధిగా వర్షాలు ఇక అప్పుడే..!!
pawan-kalyan-gives-green-signal-to-jana-sena-leaders-to-contest-panchayat-elections-details-here

పవన్ తాజా నిర్ణయంతో

మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవని... జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తా రని జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+