సింహాచలం అప్పన్న భక్తులకు అలర్ట్: దర్శనం కోసం ఇక ఇలా తప్పనిసరి..!!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు బిగ్ అలర్ట్. దేవస్థానం దర్శనం విషయం లో కీలక మార్పు తీసుకొచ్చింది. కొత్త నిబంధనలు విధించింది. ఇక నుంచి స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ మార్పులు అమలు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ మార్పు ఖచ్చితంగా అమలు చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇందు కోసం మహిళలు, పురుషులకు ప్రత్యేక సూచనలు చేసారు.

సింహాచలం ఆలయ అధికారులు కొత్త నిబంధన అమల్లోకి తెస్తున్నారు. ఇక నుంచి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. టీషర్ట్స్, జీన్స్, స్లీవ్ లెస్‌తో వస్తే స్వామివారి ఆలయంలోకి ఎంట్రీ ఉండదు. సింహా చలం ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయిం చారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. సనాతన ధర్మ సంప్రదాయాలను, ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కొత్త నియమావళిని అమల్లోకి తెస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మోడ్రన్ వెస్ట్రన్ దుస్తులతో వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదు. ముఖ్యంగా జీన్స్, టీషర్టు లు, షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్ లాంటి ఆధునిక వస్త్రాలు ధరించి వస్తే అనుమతించరు. ప్రత్యేకంగా డ్రస్ కోడ్ ఆలయ అధికారులు ప్రకటించారు.

 శ్రీవారికి 121 కిలోల స్వర్ణాభరణాల భారీ కానుక - ఎవరీ భక్తుడు, 45 రకాల ఎంపిక వెనుక..!!
శ్రీవారికి 121 కిలోల స్వర్ణాభరణాల భారీ కానుక - ఎవరీ భక్తుడు, 45 రకాల ఎంపిక వెనుక..!!
simhachalam-temple-to-enforce-dress-code-from-december-1-as-authorities-latest-decision

ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అమలు

ఇక నుంచి పురుషులు ధోతీ (పంచె)తో పాటు అంగవస్త్రం గానీ, కుర్తా పైజామా గానీ ధరించాలి. ఒకవేళ అవి వీలుకాకపోతే సంప్రదాయ బద్ధమైన ఫార్మల్ ప్యాంట్, షర్ట్ వేసుకుని రావచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే చీర, లంగావోణీ లేదా కచ్చితంగా దుపట్టా (చున్నీ) ఉన్న చుడీదార్ మాత్రమే ధరించాలి. ఈ నిబంధనలు పాటించిన వారినే దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, ఇతర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు వస్త్రధారణ నియమాలు మరింత కఠినంగా ఉంటాయి. సేవల్లో కూర్చునే పురుష భక్తులు తప్పనిసరిగా ధోతీ-అంగవస్త్రం లేదా సంప్రదాయ కుర్తా-పైజామా మాత్రమే ధరించాలని సూచించారు. భక్తులు దైవ సన్నిధికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+