కార్తీక పౌర్ణమి ముహూర్తం, 360 వత్తుల దీపం వెనుక- ఈ సారి ప్రత్యేకతలు, నియమాలు..!!

కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే చివరి పౌర్ణమి కావడంతో భక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు, దీపారాధనలు నిర్వహిస్తారు. పూజలు, దానధర్మాలతో పాటు కొన్ని నియమాలను కూడా పాటించాలని పండితు లు సూచిస్తున్నారు. ఈ సారి కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తంతో పాటుగా 360 వత్తుల దీపం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.

కార్తీక పౌర్ణమిని పరమ పవిత్రంగా.. మరో మహాశివరాత్రిగా భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24వ తేదీ (మంగళవారం) వచ్చింది. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి వేళ నవంబర్ 23 రాత్రి 11.42 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 24వ తేదీ రాత్రి 8.23 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం వేళ ఏ తిథి ఉంటే.. దానినే పరిగణిస్తారు. దీంతో నవంబర్ 24వ తేదీ కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సముద్ర లేదా నదీ స్నానం ఆచరించాలి. నదికి వెళ్లలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఇష్టదైవాన్ని పూజించడం, పేదలకు అన్నదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం వేళ ఇంట్లో, తులసి కోట దగ్గర, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. శివునికి బిల్వ పత్రాలు సమర్పించాలి. మహా విష్ణువుని పూజిస్తే.. తులసీ దళాలు సమర్పించాలి. కార్తీక పురాణం చదవాలి. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో 360 వత్తులతో దీపం వెలిగించాలి.

శ్రీవారికి భక్తుడి రూ 160 కోట్ల బంగారు ఆభరణాల కానుక - 121 కిలోల ఎంపిక వెనుక..!!
శ్రీవారికి భక్తుడి రూ 160 కోట్ల బంగారు ఆభరణాల కానుక - 121 కిలోల ఎంపిక వెనుక..!!
karthika-pournami-2026-date-significance-and-why-devotees-consider-it-another-maha-shivaratri

భక్తి శ్రద్దలతో... ప్రత్యేకమైన రోజు

కాగా, 365 వత్తుల ప్రజ్వలన వేళ కొన్ని నియమాలు పాటించాలి ఆవునెయ్యిలో తడిపిన వత్తుల దీపం వెలిగించాలి. తులసి కోట లేదా ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయడం వల్ల సకల దోషాలు తొలుగుతాయి.ఈ పౌర్ణమి సాయంత్రం వేళల్లో శివాలయంల్లో నిర్వహించే జ్వాలాతోరణం దర్శించు కొని ఆ మంటల కింద నడవటంవల్ల గ్రహ బాధలు, అపమృత్యుదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ వత్తులతో దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కొవ్వొత్తులతో అస్సలు వెలిగించ కూడదు. అగరబత్తిని ఉపయోగించి ఈ వత్తులను వెలిగించాలి. పౌర్ణమి రోజు చాలా మంది ఉసిరికాయలతో దీపారాధన చేస్తారు. ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం వేళ దీపారాధన చేస్తారు. అలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఇక, ఆ రోజు రాత్రి చంద్రుడిని దర్శించుకోవాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున తులసి ఆకులను కోయడం మంచిది కాదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+