మూసీనదికి పూర్వవైభవం.. 55 కిలోమీటర్ల మేర సూపర్ ప్లాన్!

హైదరాబాద్ మహానగరం గుండా ప్రవహించే మూసీ నదికి పూర్వవైభవం తీసుకురావడానికి 55 కిలోమీటర్ల మేర బృహత్తర పునరుద్ధరణ ప్రణాళిక రూపొందించినట్లు ఇంజినీరింగ్ నిపుణులు వెల్లడించారు. నగరంలో జరుగుతున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాల్లో భాగంగా శనివారం నిర్వహించిన పలు చర్చాగోష్ఠుల్లో ఇంజినీరింగ్ అధికారులు, నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నది స్వచ్ఛతతో పాటు తీర ప్రాంత అభివృద్ధిని సమన్వయం చేస్తూ ఈ ప్రణాళికను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

మూసీని పునరుజ్జీవింపజేయడంలో ప్రధానంగా మురుగునీటి ప్రవాహాన్ని నియంత్రించడంపై దృష్టి సారించినట్లు నిపుణులు చెప్పారు. ట్రంక్ సీవర్ లైన్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా వ్యర్థ జలాలు నేరుగా నదిలోకి చేరకుండా అడ్డుకునే ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఐదు జోన్లుగా విభజించి నది తీర రహదారులు, వంతెనలు, రివర్‌ఫ్రంట్‌ను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

Musi Revival Mega Plan for 55-Km IRC Sessions Focus on Road Safety and AI Highways for a 55-km Musi River rejuvenation

ఈ నిర్మాణాల మన్నిక కోసం ప్రాచీన సాంకేతికతను ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలతో మేళవించాలని నిపుణులు సూచించారు. వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం వంటి చారిత్రక కట్టడాల నిర్మాణంలో వాడిన సాంకేతిక నైపుణ్యాన్ని అధ్యయనం చేసి, దానికి ఆధునిక ఇంజినీరింగ్ కోడ్‌లను జోడించడం ద్వారా దీర్ఘకాలం నిలిచే నిర్మాణాలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో ఇంజినీరింగ్ అధికారులు శాస్త్రి, శశిధర్, ఎం.సత్యనారాయణ, పురావస్తు నిపుణుడు శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రహదారి రవాణా వ్యవస్థలో భద్రతను పెంచడానికి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని నిపుణులు నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా ఏటా 1,600 మందికిపైగా చిన్నారులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిలో మూడింట రెండొంతుల ఘటనలకు అతి వేగమే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ప్రత్యేక పాదచారుల క్రాసింగ్‌లు, పారాబోలిక్ ప్లాస్టిక్ మార్కర్లు ఏర్పాటు చేసిన చోట వాహనాల వేగం గంటకు 45-50 కి.మీ. నుంచి 25-27 కి.మీ.కు తగ్గినట్లు వివరించారు.

తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను అమలు చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) హైదరాబాద్ ప్రాంతీయ అధికారి శివశంకర్ తెలిపారు. మహబూబ్‌నగర్-రాయచూర్ (ఎన్‌హెచ్‌-167) రహదారిలో దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత మెషిన్ కంట్రోల్ ప్రాజెక్టు ద్వారా అత్యంత కచ్చితత్వంతో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ మానిటరింగ్, అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, క్యూఆర్ కోడ్ సమాచార బోర్డులతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయ హంగులతో ఓయూకు మహర్దశ.. రూ.480 కోట్ల పనులకు టెండర్లు,శంకుస్థాపన అప్పుడే!
అంతర్జాతీయ హంగులతో ఓయూకు మహర్దశ.. రూ.480 కోట్ల పనులకు టెండర్లు,శంకుస్థాపన అప్పుడే!

నగరంలో మురుగునీటి శుద్ధి, నది తీరాల పునరుద్ధరణ సక్రమంగా జరిగితే హైదరాబాద్ పర్యావరణం, ప్రజారోగ్యం, పట్టణ సౌందర్యానికి పెద్ద తోడ్పాటు లభిస్తుంది. ఐఆర్‌సీ సదస్సులో భాగంగా జరిగిన 19 టెక్నికల్ సెషన్లు శనివారంతో ముగియగా, ఆదివారం మధ్యాహ్నం కౌన్సిల్ సమావేశంతో ఈ సదస్సులకు తెరపడనుంది. తదుపరి ఐఆర్‌సీ 86వ సదస్సును కోల్‌కతాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+