పదివేలు వడ్డీకి ఇచ్చిన ఖర్మానికి లైఫే గల్లంతు.. గుంటూరు జిల్లాలో దారుణం

చిన్నపాటి ఆర్థిక లావాదేవీలే ప్రాణాల మీదికి తెస్తున్నాయి. సాయం చేసిన చేతినే నరికినట్లుగా, ఇచ్చిపుచ్చుకున్న రూ.10 వేల విషయంలో తలెత్తిన వివాదం గుంటూరులో ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. సహాయం కోరిన వ్యక్తికే డబ్బు ఇచ్చి, తిరిగి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

వివరాల్లోకి వెళ్తే, గుంటూరులోని పలకలూరు రోడ్డు ప్రాంతంలోని స్వగృహ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో దొడ్డ నాగరాజు నివాసం ఉండేవారు. ఆయన ఫోన్‌పే సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నాగరాజు భార్య, పిల్లలు విజయవాడలోని అత్తవారింట్లో ఉంటున్నారు. అక్టోబరు 20న తన తండ్రి నతానియేల్‌కు చెప్పి, విజయవాడ వెళ్లి భార్యాపిల్లలను ఇంటికి తీసుకొస్తానని బయటకు వెళ్లారు.

Guntur murder Killed Over Rs 10 000 Dispute Young Man Brutally Murdered in Guntur andhra pradesh

అయితే రాత్రి పొద్దుపోయినా నాగరాజు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తండ్రి నతానియేల్ బంధువులు, తెలిసిన వారి వద్ద విచారించినా కుమారుడి జాడ దొరకలేదు. చివరకు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అక్టోబరు 22న పలకలూరు రోడ్డు పరిసరాల్లో నాగరాజు మృతదేహం లభ్యమైంది. తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును హత్యగా మార్చి లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తులో ఈ హత్య వెనుక రూ.10 వేల ఆర్థిక వివాదం ఉన్నట్లు తేలింది. వెంగళాయపాలెం టిడ్కో అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న నడ్డి దుర్గా యశ్వంత్‌కు వ్యక్తిగత అవసరాల కోసం నాగరాజు రూ.10 వేలు ఇచ్చారు. ఆ డబ్బు తిరిగి చెల్లించాలని నాగరాజు కోరడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగింది.

ఈ గొడవను మనసులో పెట్టుకున్న దుర్గా యశ్వంత్, తన పరిచయస్తులైన స్తంభాలగరువుకు చెందిన నడ్డి మల్లు అలియాస్ మనోజ్, అడవితక్కెళ్లపాడుకు చెందిన నంబూరు అశోక్, బొంగరాలబీడుకు చెందిన దాసరి సుభాష్‌తో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో నాగరాజును అంతమొందించాలని నలుగురూ కలిసి పథకం పన్నారు. పలకలూరు రోడ్డులో నాగరాజు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి మద్యం సీసాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు.

అంతర్జాతీయ హంగులతో ఓయూకు మహర్దశ.. రూ.480 కోట్ల పనులకు టెండర్లు,శంకుస్థాపన అప్పుడే!
అంతర్జాతీయ హంగులతో ఓయూకు మహర్దశ.. రూ.480 కోట్ల పనులకు టెండర్లు,శంకుస్థాపన అప్పుడే!

కేసును ఛేదించిన పట్టాభిపురం పోలీసులు నిందితులు దుర్గా యశ్వంత్, మనోజ్, అశోక్, సుభాష్‌లను అరెస్టు చేశారు. డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+