దిగజారుతున్న బంగారం ధరలు: లక్ష రూపాయల వరకు తగ్గే ఛాన్స్

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పతనమౌతూ వస్తోన్నాయి. పసిడి ఒకే వారంలో దాదాపు తొమ్మిది శాతం మేర క్షీణించడం దీనికి నిదర్శనం. బంగారంతో పాటు వెండి ధర కూడా గ్లోబల్ మార్కెట్ లో ఏకంగా 15 శాతం మేర కుప్పకూలింది. దీంతో దేశీయంగా వీటి ధరలు తగ్గుముఖం పడుతోన్నాయి. ఇదివరకు గరిష్ట స్థాయిల్లో కొనసాగిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తోండటం చర్చనీయాంశమైంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి తోడు బాండ్ ఈల్డ్స్, డాలర్ బలపడటం వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బకొడుతోన్నాయి.. ప్రతికూల ప్రభావం చూపుతోన్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,514.08 డాలర్ల స్థాయికి చేరుకోగా, డిసెంబర్ పసిడి ఫ్యూచర్స్ ధరలు 3,515.40 డాలర్ల వద్ద ముగిశాయి. ఇక స్పాట్ వెండి ధర ఔన్సుకు 40.99 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Gold prices crashed about 9 percent largest weekly loss close to its lowest level and Silver slipped

దీని ప్రభావం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ పై స్పష్టంగా పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,22,520 వద్ద నమోదైంది. కేజీ వెండి ధర రూ.1,49,600 శ్రేణిలో కొనసాగింది. ప్రస్తుతం మార్కెట్ లో బంగారం రేట్లు పుంజుకోవడానికి ఎటువంటి సానుకూల పరిస్థితులు కనిపించట్లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ వారంలో కూడా ఇదే నెగెటివ్ ట్రెండ్ కొనసాగవచ్చని చెబుతున్నాయి. క్రమంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు లక్ష రూపాయల వరకు పడిపోయే అవకాశాలను కొట్టిపారేట్లేదు.

సికింద్రాబాద్, ఏపీ మీదుగా కొల్లం ప్రత్యేక రైలు: అరుణాచలం, శ్రీరంగం కవర్ చెయ్యొచ్చు
సికింద్రాబాద్, ఏపీ మీదుగా కొల్లం ప్రత్యేక రైలు: అరుణాచలం, శ్రీరంగం కవర్ చెయ్యొచ్చు

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,500 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,12,292 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,22,300 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,12,108 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,22,660, రూ.1,12,438 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,22,400, 22 క్యారెట్లు రూ. 1,12,200 వద్ద కొనసాగుతున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381

ముంబై..

24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+