ఆదినారాయణ రెడ్డి అసంతృప్తి వెనుక, అసలు టార్గెట్...!?

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి. కడప జెడ్పీ ఛైర్మన్ విషయంలో అసంతృప్తి తో రాజీనామాకు సిద్దమైన ఆదినారాయణ రెడ్డి పార్టీ ముఖ్యులతో చర్చలు చేస్తున్నారు. తన సోదరుల కుమారులు జెడ్పీటీసీ పదవుల్లో మాత్రం కొనసాగరని తేల్చి చెప్పారు. కూటమిలో అస్పష్టత ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం బీజేపీకి ఎంతో చేసిందని.. బీజేపీకి మాత్రం ప్రాధాన్యత ఏపీలో దక్కటం లేదని వాపోయారు. దీంతో, అసలు ఆదినారాయణ రెడ్డి టార్గెట్ ఎవరు.. తదుపరి నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

కడప జిల్లాలో స్థానిక ఎన్నికల వేళ కూటమి గెలుపు బాధ్యతలు ఆదినారాయణ రెడ్డి ప్రతిష్ఠాత్మకం గా భావించారు. పులివెందుల సహా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో ప్రభావం చూపించారు. ఇక, జిల్లా పరిషత్ ఛైర్మన్ సీటు తన సోదరుడి కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి ఇవ్వాలని పట్టు బట్టారు. అధికారికంగా జాబితా ప్రకటన ముందు వరకు ఆదినారాయణ రెడ్డి కుటుంబానికే సీటు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. తమకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని.. అయితే, చివరి 20 నిమిషాల్లో నిర్ణయం మారటం వెనుక కారణం ఏంటని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒక దశలో రాజీనామాకు సిద్దపడ్డారనే వార్తలు వచ్చాయి. బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు ఆదినారాయణ రెడ్డితో చర్చించారు. సీఎం చంద్రబాబు, లోకేష్ తోనూ ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు. తమకు జెడ్పీ సీటు ఇవ్వకపోవటం పైన అసంతృప్తి వ్యక్తం చేసారు. రాజీనామా విషయంలో వెనుకడుగు వేయలేదని.. ఢిల్లీ లో చర్చల తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెబుతున్నారు.

 శ్రీవారికి 121 కిలోల స్వర్ణాభరణాల భారీ కానుక - ఎవరీ భక్తుడు, 45 రకాల ఎంపిక వెనుక..!!
శ్రీవారికి 121 కిలోల స్వర్ణాభరణాల భారీ కానుక - ఎవరీ భక్తుడు, 45 రకాల ఎంపిక వెనుక..!!
adinarayana-reddy-s-next-move-sparks-political-interest-amid-discontent-here-the-report

ముఖ్య నేతలతో ఆదినారాయణ రెడ్డి చర్చలతో

అయితే, ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేసే అవకాశం లేదనే చర్చ వినిపిస్తోంది. రాజీనామా చేసి మరో పార్టీ వైపు చూసే అవకాశం కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో తమ సోదరుల కుమారులకు టికెట్ల కోసం ఆదినారాయణ రెడ్డి భారీ వ్యహం సిద్దం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కడప ఎంపీ సీటు పైన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి సోదరుడు పోటీలో ఉన్నారు. దీంతో.. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా.. లేక ఎంపీగా బరిలోకి దిగే ఆలోచనతో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. ఇందు కోసం ఒక సోదరుడి కుమారుడికి జెడ్పీ చైర్మన్ సీటు కోసం ప్రయత్నించారు. అయితే, చివరి నిమిషంలో పదవి చే జారింది. దీంతో.. ఇప్పుడు బీజేపీ ముఖ్య నాయకత్వం తో చర్చల ద్వారా ఆదినారాయణ రెడ్డికి ఎలాంటి హామీ వస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+