పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రసవం.. వరుడు షాక్.. ఆపై జరిగిందిదే!

సహజంగా పెళ్లి అంటే ఇద్దరు దాంపత్య బంధలోకి అడుగు పెట్టటం. అయితే తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో పెళ్ళయిన మరుసటి రోజే వధువు తల్లి కావటం అందరినీ షాక్ కు గురి చేసింది. పెళ్లయిన మరుసటి రోజే వధువు బిడ్డకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చకు, కలకలానికి దారితీసింది. పాళయంగోట్టయ్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై నవవరుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే, పాళయంగోట్టయ్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడికి, తాళయూత్తు ప్రాంతానికి చెందిన యువతితో ఈ నెల 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి వధువు భర్త ఇంటికి చేరుకుంది. అప్పటివరకు అంతా సాధారణంగానే సాగుతున్నట్లు అనిపించినా, మరుసటి రోజు ఉదయం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

Bride Gives Birth to a baby a Day After Wedding Shocking Incident Sparks Stir in Tirunelveli groom complaint

ఉదయం వధువుకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పాటు రక్తస్రావం మొదలైంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రసవం జరిగినట్లు నిర్ధారించడంతో ఇంట్లో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అంతకు ముందే వరుడి ఇంటి పరిసరాల్లో శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు, శిశువు మరణానికి గల కారణాలు, ప్రసవ పరిస్థితులపై విచారణ చేపట్టారు. వైద్యాధికారుల నివేదిక, పోస్టుమార్టం ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

పదివేలు వడ్డీకి ఇచ్చిన ఖర్మానికి లైఫే గల్లంతు.. గుంటూరు జిల్లాలో దారుణం
పదివేలు వడ్డీకి ఇచ్చిన ఖర్మానికి లైఫే గల్లంతు.. గుంటూరు జిల్లాలో దారుణం

ఈ పరిణామాల నేపథ్యంలో నవవరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను పెళ్లి చేసుకున్న యువతి అప్పటికే ఏడు నెలల గర్భవతి అని, ఆ విషయాన్ని తనకు గానీ, తమ కుటుంబానికి గానీ తెలియకుండా దాచిపెట్టి వివాహం జరిపించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో తమ కుటుంబం తీవ్ర మానసిక ఆవేదనకు గురైందని వాపోయాడు. తనకు న్యాయం కావాలని కోరుతున్నాడు. తిరునెల్వేలి పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+