అయోధ్య - జనక్ పూర్(నేపాల్) వందేభారత్ సిద్దం: ముహూర్తం, రూట్.. షెడ్యూల్..!!
అయోధ్య నుంచి సీతా మాత జన్మస్థనం జనక్ పూర్ వరకు వందేభారత్ సర్వీసు ప్రారంభం కానుంది. అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు వందేభారత్ అందుబాటులోకి వచ్చింది. మొత్తం 604 కిలోమీటర్ల మేర దూరాన్ని ఇవి కవర్ చేయనుండగా.. వారానికి ఒక రోజు అందుబాటులో ఉంటుంది. బీహార్, యూపీలోని అనేక ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణించ నుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఈ వందేభారత్ రూట్.. షెడ్యూల్ ఖరారు చేసింది.
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరామచంద్రుడు కొలువైన అయోధ్య నుంచి జనక్ పూర్‌కు సులభంగా చేరుకునేందుకు వందేభారత్ సర్వీసు అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఇండియా నుంచి నేరుగా నేపాల్‌కు వందే భారత్ ట్రైన్ నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 23వ తేదీన ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ- నేపాల్ ప్రధాని బలేంద్ర షా ఇద్దరూ కలిసి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఢిల్లీలో పచ్చజెండా ఊపి వర్చువల్ విధానంలో ప్రారంభిం చేందుకు ముహూర్తం ఖరారు అయింది. దీని ద్వారా అయోధ్య నుంచి సీతా మాత జన్మించిన జనక్పూర్తో పాటు అక్కడి పర్యాటక ప్రదేశాలకు సులువుగా చేరుకోవచ్చు.ఈ రైలు ద్వారా సీతా మాత జన్మస్థలంతో పాటు చుట్టుపక్కల ఉండే దేవాలయాలను సందర్శించుకోవచ్చు. అలాగే నేపాల్ నుంచి భక్తులు అయోధ్యకు సౌకర్య వంతంగా చేరుకునే వెసులుబాటు కలగనుంది.

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో
ఈ వందే భారత్ రైలు నవంబర్ 23న అయోధ్య నుంచి ప్రారంభమై నేపాల్‌కు చేరుకోనుంది. ఈ రైలుకు పది స్టాపులు ఉంటాయి. మొత్తం 604 కిలోమీటర్ల మేర దూరాన్ని ఇవి కవర్ చేయనుండ గా.. వారానికి ఒక రోజు అందుబాటులో ఉంటుంది. బీహార్, యూపీలోని అనేక ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. అయోధ్య నుంచి ప్రతీ సోమవారం, తిరుగు ప్రయాణంలో జనక్‌పూర్ థామ్ నుంచి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. కాగా, జయనగర్, మధుబని, శిషో, సీతామర్హి, రక్సాల్, నర్కటియాగంజ్, గోరఖ్‌పూర్, బస్తీ. మాన్కాపూర్, అయోధ్య ధామ్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. కాగా ఈ రైలు ద్వారా అందించడం, ప్రాంతీయ పర్యాటకాన్ని, ఆర్థిక కార్యకలాపాలను, భారత్-నేపాల్ స్నేహపూర్వక సంబంధాలను ప్రోత్సహించడం ఈ రైలు లక్ష్యంగా కేంద్రంలోని ముఖ్యులు వివరిస్తున్నారు.













Click it and Unblock the Notifications
