టాలీవుడ్ ను దున్నేస్తోన్న దుల్కర్ సాబ్: 100% స్ట్రైక్ రేట్

దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం టాలీవుడ్ ను దున్నేస్తోన్నాడు. మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఈ యంగ్ స్టార్ హీరో.. తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేస్తోన్నాడు. తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు. కథల ఎంపిక, దానికి తగ్గట్టుగా నటించడంలో ఓ బెంచ్ మార్క్ ను నెలకొల్పాడు. తన నిర్ణయానికి తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్ల నుంచి సైతం సూపర్ హిట్ సినిమాలను రాబట్టుకుంటోన్నాడు.

2012లో ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు 43 సినిమాల్లో నటించాడు. ఇందులో 28 మలయాళ మూవీలు. తెలుగులో నాలుగు, తమిళంలో అయిదు, హిందీలో మూడు మూవీల్లో లీడ్ క్యారెక్టర్లు పోషించాడు. కల్కి 2898 ఏడీ, ఛాంపియన్ లో కామియో అప్పియరెన్స్ ఇచ్చాడు. టాలీవుడ్ కథల ఎంపిక విషయంలో అతని జడ్జి మెంట్ కు తిరుగు ఉండట్లేదు. అదే ఇక్కడి ప్రేక్షకుల్లో అనూహ్య రీతిలో అపూర్వ ఆదరణను తెచ్చిపెట్టింది.

Dulquer Salmaan has cultivated dedicated following among Telugu films through his careful selection of movies

సాధారణంగా పరభాషా కథానాయకులు వేరే భాషలో వరుసగా సక్సెస్ సాధించడం అంత సులభం కాదు. దుల్కర్ సల్మాన్ మాత్రం టాలీవుడ్‌లో భాషా సరిహద్దులను చెరిపేశాడు. కథలోని బలాన్ని, పాత్రలోని వైవిధ్యాన్ని మాత్రమే నమ్మి సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే సక్సెస్ జర్నీ కొనసాగుతూ వస్తోంది. డబ్బింగ్ సైతం తానే చెబుతూ అటు భాషపైనా పట్టు సాధించడం తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది.

న్యూజిలాండ్.. బిగ్ ఫైట్ ఫర్ సర్వైవల్
న్యూజిలాండ్.. బిగ్ ఫైట్ ఫర్ సర్వైవల్

తెలుగులో దుల్కర్ మొత్తం నాలుగు స్ట్రైట్ సినిమాల్లో నటించగా.. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. బాక్సీఫస్ వద్ద కనకవర్షాన్ని కురిపించాయి. దీంతో.. అప్పటిదాకా పెద్దగా పరిచయం లేని ఆ నాలుగు సినిమాల దర్శకులకు స్టార్ హోదా లభించిందంటే అవి ఏ స్థాయిలో హిట్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఆయా దర్శకుల గమనాన్నే మార్చివేశాడు దుల్కర్.. ఒకరకంగా. మహానటికి ముందు నాగ్ అశ్విన్ తీసిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఒక్కటే.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటితో దుల్కర్ టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో తమిళ నటుడు జెమిని గణేశన్ పాత్రలో ఆయన జీవించిన తీరు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2022లో వచ్చిన 'సీతా రామం' చిత్రం దుల్కర్ కెరీర్‌లోనే ఒక క్లాసిక్‌గా నిలిచింది. లెప్టినెంట్ రామ్ పాత్రలో ఆయన కనబరిచిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది.

దిగజారుతున్న బంగారం ధరలు: లక్ష రూపాయల వరకు తగ్గే ఛాన్స్
దిగజారుతున్న బంగారం ధరలు: లక్ష రూపాయల వరకు తగ్గే ఛాన్స్

2024లో లక్కీ భాస్కర్ సినిమాలో ఓ బ్యాంకర్ పాత్రలో జీవించేశాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టిందా మూవీ. ఈ సినిమా అతని మార్కెట్ రేంజ్ ను మరింత పెంచింది. ఈ మూవీకి జాతీయ స్థాయి అవార్డు సైతం లభించింది. బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ అవార్డును అందుకున్నాడు. అదే ఏడాది కల్కి 2898లో అతిథి పాత్రలో నటించాడు. అదీ సూపర్ హిట్టే.

అదే సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగిస్తోన్నాడు దుల్కర్. తాజాగా ఈ నెల 20న థియేటర్లలోకి వచ్చిన ఆకాశంలో ఒక తార.. దుల్కర్ స్థాయి ఏమిటో తెలియజేసింది. ఓ స్ఫూర్తిదాయకమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ డ్రామా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సాధిస్తోంది. ఈ విజయంతో తెలుగులో ఆయన నటనకు, కథల ఎంపికకు ఉన్న తిరుగులేని ఆదరణ మరోసారి స్పష్టమైంది. ఈ చిత్రం కూడా సక్సెస్ కావడంతో టాలీవుడ్‌లో ఆయన వంద శాతం విజయావకాశాలు ఉన్న కథానాయకుడిగా రికార్డు సృష్టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+