కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిన్న సినిమా.. 'రామాయణ' ను తట్టుకుని..!

ఇటీవలి కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. పెద్ద పెద్ద హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అయి ప్లాఫ్ అవుతున్నాయి. మరోవైపు చిన్న సినిమాలు సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే తాజాగా యంగ్ హీరో మౌళి నటించిన డీఎన్‌ కే మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

గతంలో లిటిల్ హార్ట్స్ మూవీతో మౌళి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా తొలి సినిమాతోనే మౌళి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో నటించే అవకాశం లభించింది. అలా డీఎన్ కే మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మౌళి. టీజర్, ట్రైలర్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

డీఎన్ కే మూవీ క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. ఈ మేరకు తొలి వారాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక విడుదలైన మూడు రోజుల్లోనే డీఎన్ కే మూవీ రూ.10.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తక్కువ సమయంలోనే ఇలా మంచి వసూళ్లను సాధించడం ఆసక్తికరంగా మారింది.

Mouli Young hero film DNK enters the profit zone collecting Rs 10 15 crore in just three days

అంతేకాకుండా ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే లాభాల జోన్‌ లోకి ప్రవేశించినట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ మంచి ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు మౌళి.. మూడో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఓ తమిళ్ బ్యానర్ లో సినిమా చేసేందుకు అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+