Sonia Gandhi: ఆత్మకథ అందుకే రాశా..! బుక్ రిలీజ్ వేళ అసలు కారణం చెప్పిన సోనియా..!

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తాజాగా "బిలాంగింగ్- ఏ జర్నీ ఆఫ్ లవ్" పేరుతో తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకం ఇప్పటికే అనధికారికంగా విడుదలై సంచలనాలు రేపుతుండగా.. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ ఛీఫ్ ఖర్గే, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, వీడీ సతీషన్, విజయ్, హేమంత్ సోరెన్, అఖిలేష్, అభిషేక్ బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మాజీ సీఎం అమరీందర్ సింగ్, సుప్రియా సూలేతో పాటు పలువురు విపక్ష నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తాను ఆత్మకథ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న దానిపై సోనియాగాంధీ కారణాన్ని బయటపెట్టారు.

SIR పై ఈసీకి 48 ప్రశ్నలు-నేరుగా అడిగేందుకు సుప్రీం అనుమతి కోరిన విపక్షాలు..!
SIR పై ఈసీకి 48 ప్రశ్నలు-నేరుగా అడిగేందుకు సుప్రీం అనుమతి కోరిన విపక్షాలు..!

తన అత్త ఇందిర, పిల్లలు రాహుల్, ప్రియాంక సహా కుటుంబం గురించి ప్రచారంలో ఉన్న అవాస్తవ, బాధాకర కథల కారణంగానే తాను ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీ (Sonia Gandhi) వెల్లడించారు. ఇందులో తన సొంత అనుభవాల్ని పంచుకోవడంతో పాటు తమ గురించి ఇతరులు రాసిన వాటికి అతీతంగా తమ కుటుంబ జీవితాన్ని అర్ధం చేసుకునే అవకాశాన్ని పాఠకులకు అందించేందుకు చేసిన ప్రయత్నంగా దీన్ని అభివర్ణించారు. మన చుట్టూ కథలు, అబద్దాలు అల్లుతారని, నిజానికి ఏమాత్రం సంబంధం లేని బాధపెట్టే మాటలు అంటారని, తన భావాలు, కుటుంబం గురించి తెలిసిన విషయాలు బయటపెట్టేందుకు ఇదో మార్గమని భావించానని, ప్రజలు కూడా తన కథ వినడానికి సుముఖంగా ఉంటారని సోనియా తెలిపారు.

Sonia Gandhi Opens Up on Memoir Says Hurtful Stories About Family Inspired Her to Write
2004లో అలా ప్రధాని పదవి వదులుకున్నా- ఇంత జరిగింది- ఆత్మకథలో సోనియా సంచలనం..!
2004లో అలా ప్రధాని పదవి వదులుకున్నా- ఇంత జరిగింది- ఆత్మకథలో సోనియా సంచలనం..!

మొదట్లో తన వ్యక్తిగత అనుభవాలు బయటపెట్టేందుకు సంకోచించినా, పిల్లలు రాహుల్, ప్రియాంక పుస్తకం రాయమని ప్రోత్సహించడంతో అంగీకరించినట్లు తెలిపారు. ఇందులో కొన్ని బాధాకరమైన విషయాలు తిరిగి తల్చుకోవడం కష్టంగా ఉండేదన్నారు. తానెప్పుడూ డైరీ రాయలేదని, అందుకే తన జీవితం, రాజకీయాలగురించి రాయడం సవాలుగా అనిపించిందన్నారు.
తాను ఓ సమూహంలో ఇమిడిపోవడానికి ఎంత కష్టపడ్డానో ఈ పుస్తకం పేరు బిలాంగింగ్ ఇందులో పదే పదే వివరిస్తుందన్నారు. పెళ్లి తర్వాత అత్తారింట్లో ఇమిడిపోయేందుకు తాను మాత్రమే కాదని, ఎంతో మంది అమ్మాయిలు ఇలాగే ఇబ్బంది పడతారని, కానీ సర్దుకుపోవాలన్నారు. ఈ దేశాన్ని, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డానని, కానీ క్రమంగా మెచ్చుకోవడం నేర్చుకున్నానని ఆమె అంగీకరించారు. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకోబోతున్నాననే విషయం తప్ప, దీని గురించి పెద్దగా ఆలోచించలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+