Shocking Video: చర్లపల్లి రైల్వే స్టేషన్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న బోగీలు..

హైదరాబాద్‌ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగీ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో స్టేషన్ లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Cherlapally Major fire at Cherlapally railway station flames erupt suddenly in a stationary train

అయితే.. అగ్ని ప్రమాదం జరిగిన ఆ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అందుకు ప్రత్యామ్నాయంగా పలు కీలక రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే రైల్వే భద్రతా అధికారులు, పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అటు సాంకేతికమైన ఆధారాలను అన్వేషిస్తున్నారు. ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+