అలా చేస్తుంటే ఇంకో 30 ఏళ్లయినా అధికారంలోకి రారు.. రాహుల్ గాంధీపై అమిత్ షా సంచలనం

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను ఉద్దేశిస్తూ అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువును రాహుల్ గాంధీ తీస్తున్నారని మండిపడ్డారు. విదేశాల్లో భారత గౌరవాన్ని కించపరిస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ కలిగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆయన గౌరవాన్ని తగ్గించేలా రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"మీకు అధికారం కావాలంటే వెంటనే విదేశీ పర్యటనలను ఆపేసి గ్రామాల్లో పర్యటించండి. అలా చేయడం వల్ల ఎప్పుడో ఓసారి మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ నా మాట ఎప్పుడూ వినరు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పేది ఒక్కటే.. మీరంతా ఆయన మార్గంలోనే వెళ్తే ఇంకో 30 ఏళ్లు అయినా మీకు అధికారం దక్కదు" అని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు రాహుల్ గాంధీ రాజకీయాల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు.

AmitShah on Rahul Gandhi lashing out at him for bringing disrepute to India international platforms

అయితే అంతకుముందు హైదరాబాద్‌ లో జరిగిన భారత్ సమిట్ 2026లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లోనే భారత ప్రజాస్వామ్యం ధ్వంసమైందని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ షా దీనికి కౌంటర్ ఇచ్చారు. భారత్ సమిట్ అనే పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీ.. భారత వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేశారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల స్కామ్ లు జరిగాయని అమిత్ షా మండిపడ్డారు. అందుకే ప్రజలు ఆ పార్టీని అధికార పీఠం నుంచి దూరం పెట్టారని స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోదీ గత 12 ఏళ్లుగా పాలిస్తున్నారని ఆయనపై ఇప్పటివరకూ నాలుగు అణాల ఆరోపణ కూడా నమోదు కాలేదని అమిత్ షా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+