జనసేన బిగ్ ట్విస్ట్- కాకినాడ సహా ఐదు చోట్ల అభ్యర్ధుల ప్రకటన..!

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన (Janasena) మరో ట్విస్ట్ ఇచ్చింది. రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాకినాడ కార్పోరేషన్ లో సరైన అభ్యర్ధి లేని కారణంగా పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి ఆ సీటు అప్పగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టింది. కాకినాడ, శ్రీకాకుళం మేయర్ సీట్లతో పాటు మొత్తం మూడు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఈ మేరకు జనసేన జాబితాను విడుదల చేసింది.

ఏపీలో మున్సిపల్ పోరుకు కూటమి సీట్లు ఖరారు..! బీజేపీ అభ్యర్ధుల ప్రకటన..!
ఏపీలో మున్సిపల్ పోరుకు కూటమి సీట్లు ఖరారు..! బీజేపీ అభ్యర్ధుల ప్రకటన..!

రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం ఖరారు చేసినట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా.దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారని తెలిపింది. అలాగే రాజాం నుంచి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని ప్రకటించింది.

JanaSena Names Candidates for Kakinada Srikakulam Mayoral Races and Three Municipal Chairman Posts
పవన్ విడాకులపై పోస్టులు..! ఇద్దరు అరెస్ట్, 42 మందికి నోటీసులు..!
పవన్ విడాకులపై పోస్టులు..! ఇద్దరు అరెస్ట్, 42 మందికి నోటీసులు..!

వాస్తవానికి కాకినాడ కార్పోరేషన్ లో బలమైన మేయర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో జనసేన ఆలోచనలో పడింది. సరైన అభ్యర్ధులు దొరకని కారణంగా ఈ కీలకమైన సీటును టీడీపీకి ఇచ్చేసినట్లు ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గోదావరి జిల్లాల్లో కీలకమైన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావం చూపే కాకినాడ కార్పోరేషన్ సీటులో జనసేన పోటీ నుంచి తప్పుకోవడం క్యాడర్ కు తప్పుడు సంకేతాలు పంపుతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే కాకినాడ కార్పోరేషన్ లో మేయర్ అభ్యర్ధిగా ఆకుల భవానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+