ఓటీటీలోకి మతి పోగెట్టే హారర్ థ్రిల్ల‌ర్.. రాత్రి చూస్తే నిద్ర పట్టదు..

హారర్ మూవీస్ కు ఎప్పుడూ సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. సాధారణంగా హరర్ మూవీస్ చూడాలంటే మలయాళం చిత్ర పరిశ్రమపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ జానర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మలయాళం ఇండస్ట్రీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తెలుగులో ఓ హారర్ మూవీ రిలీజ్ అయి ప్రేక్షకులను మెప్పించింది. అదే '418'.. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో కీర్తన్‌ నాడగౌడ తెరకెక్కించిన చిత్రం అక్టోబర్ 23న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను అలరించింది. ఓవైపు జైలర్ 2, రణబాలి లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించినా 418 మూవీ కలెక్షన్స్ మాత్రం స్టడీగానే కొనసాగాయి.

ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్ హారర్ జోనర్‌ లో నిర్మించిన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ మూవీలో సూర్య రాజ్‌ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించారు. అదే విధంగా శశాంక్ పాటిల్, రమేశ్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్​పాండే తదితరులు యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు కీర్తన్‌ నాదగౌడ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 418 మూవీ ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్‌ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Horror thriller Prashanth Neel 418 is coming to OTT on November 20 will be streaming on Netflix

418 మూవీ స్టోరీ విషయానికి వస్తే.. కర్ణాటకలోని ఓ మెడిక‌ల్ క‌ళాశాలలో 15 ఏళ్ల క్రితం మూతపడిన ఓ హాస్టల్ ను తిరిగి తెరుస్తారు. కానీ అందులో 418 నంబ‌ర్ గ‌ది మాత్రం మూసే ఉంటుంది. ఆ గది ఊసు ఎత్తితే చాలు చాలామంది గజగజ వణికిపోతుంటారు. ఈ క్రమంలో ఆ గదికి పక్కనే ఉన్న 417 గదిలో వివేక్ అనే విద్యార్థి చేరతాడు. ఆ రోజు నుంచి అతనికి భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ గదిలో ఉన్న‌ది ఎవ‌రు..? ఆ గ‌ది వెన‌కున్న ర‌హ‌స్యాలు ఏంటి..? లండ‌న్ నుంచి వ‌చ్చిన సాయేషా అనే యువతి ఆ గ‌దిలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాక ఏం జ‌రిగింది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+