కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్.. 10 రోజుల్లో 1200 కోట్లకు పైగా వసూళ్లు..!
ఇటీవల దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదలైన 'రామాయణ' చిత్రం కలెక్షన్లతో అదరగొడుతోంది. దంగల్ మూవీ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రామాయణ మూవీ కేవలం పది రోజుల్లోనే రూ. 1,228 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సాక్ నిల్క్ అందించిన రిపోర్టు ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'పఠాన్', విక్కీ కౌశల్ 'ఛావా', రణ్ బీర్ కపూర్ గత చిత్రం 'యానిమల్' రికార్డులను అధిగమించింది.
ఇక తొలివారంలో దేశవ్యాప్తంగా రామాయణ మూవీ రూ. 564.60 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. రెండో శుక్రవారం రూ. 48 కోట్లకు పైగా సాధించింది. అయితే రెండో శనివారం రామాయణ మూవీకి భారీ కలెక్షన్స్ దక్కాయి. ఒక్క రోజే రూ. 72 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి.. శుక్రవారంతో పోలిస్తే ఏకంగా 51.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ క్రమంలో పది రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 685 కోట్లకు చేరుకోగా.. గ్రాస్ రూ. 819 కోట్లకు పైగా సాధించింది. అలా కేవలం 10 రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది.
అటు ఓవర్సీస్ లోనూ రామాయణ మూవీ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ ను సృష్టిస్తోంది. ఇప్పటివరకూ విదేశాల్లో రూ. 400 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను రామాయణ మూవీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక రామాయణ మూవీ రిలీజ్ అయిన కేవలం 8 రోజుల్లోనే రూ. 1000 కోట్ల మార్క్ ను అధిగమించి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. పుష్ప 2, ధురంధర్ 2 చిత్రాల తర్వాత ఈ మూవీ నిలిచింది.

ఇక రామాయణ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీ రాముడిగా నటించారు. అలాగే సాయిపల్లవి సీతాదేవిగా నటించారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా మెప్పించారు. అలాగే రవిదూబే లక్ష్మణుడి పాత్రలో నటించారు. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ మూవీని నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ రెండో భాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications
