అవును.. మేం వేర్వేరుగా ఉంటున్నాం.. కానీ: కృష్ణవంశీతో విడాకులపై రమ్యకృష్ణ క్లారిటీ..!

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రెస్‌ గా నిలిచారు సీనియర్ నటి రమ్యకృష్ణ. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆమె సినిమాలు చేశారు. సుదీర్ఘ కెరీర్​ లో దాదాపుగా 260కుపైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

50 ఏళ్లు దాటినా ఎంతో అందంగా కనిపిస్తూ ఇప్పటికీ కుర్రాళ్లను కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే ఆమె టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా రమ్యకృష్ణ చెన్నైలో నివాసం ఉంటుండగా.. కృష్ణవంశీ హైదరాబాద్‌ లో ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్ పై రమ్యకృష్ణ క్లారిటీ ఇచ్చారు. " మేము విడిపోలేదు.. ఇప్పటికీ దంపతులుగానే ఉన్నాం. కానీ ఇద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది. కెరీర్‌ పరంగా మేం అలా ఉండాల్సి వస్తోంది. మా అబ్బాయి పుట్టినప్పుడు నేను సీరియల్స్‌ తో ఫుల్ బిజీగా ఉన్నాను. ఆ సమయంలో 15 రోజులకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్‌ కు ట్రావెల్‌ చేసేదాన్ని. నేను అలా వచ్చి వెళ్లిన ప్రతిసారీ మా అబ్బాయి అనారోగ్యం బారిన పడేవాడు. దీంతో నేను వాడిని చెన్నైలోనే చదివిస్తానని కృష్ణవంశీతో చెప్పాను" అని తెలిపారు. ఇక ప్రతిరోజూ గొడవలు పడటం కంటే మంచి స్నేహితులుగా ఉండటమే మేలు అని ఆమె పేర్కొన్నారు.

RamyaKrishnan responded reports divorce from Krishna Vamsi clarifying that they have not separated

ఈ మేరకు తరచూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విడాకుల వార్తల్లో వాస్తవం లేదని.. వేర్వేరు నగరాల్లో ఉండటమే ఇలాంటి ఊహాగానాలకు కారణం అవుతుందని ఆమె తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఇక 2003 జూన్ 12 న రమ్యకృష్ణ- కృష్ణవంశీ ప్రేమ వివాహం ద్వారా ఒక్కటయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+