ఫ్రెండ్ ఇంట్లో సూర్యకుమార్ యాదవ్: మాంఛి మటన్ మసాలా, పూరీ కాంబో

టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రాక్ ఎక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్‌లో తనదైన శైలిలో అదరగొడుతున్నాడు. ఈ టోర్నమెంట్ లో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్.. కోల్‌కతాలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో హైదరాబాద్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 21 బంతుల్లోనే అజేయంగా 60 పరుగులు చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. తన ఫామ్‌పై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాడు.

హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగులను ముంబై జట్టు ఊదిపడేసింది. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా 41 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విజృంభణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. గ్రౌండ్ నలుమూలలా తన మార్క్ 360 డిగ్రీల షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలింగ్ ను తుత్తునీయలు చేశాడు. జట్టుకు విజయాన్ని అందించాడు.

Suryakumar Yadav visited one of his old friend and was seen having food sitting on floor during SMAT

గ్రౌండ్ లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించిన సూర్యకుమార్, మ్యాచ్ ముగిసిన తర్వాత కోల్‌కతాలో తన పాత మిత్రుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతను గడిపిన క్షణాలు నెటిజన్లను ఆకట్టుకుంటోన్నాయి. స్టార్ క్రికెటర్‌ హోదా ఉన్న సూర్యకుమార్ యాదవ్ నిరాడంబరంగా కనిపించి అభిమానుల మనసులను గెలుచుకున్నారు. మ్యాచ్ పూర్తయిన వెంటనే సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి తన పాత స్నేహితుడు మనీష్ ఇంటికి వెళ్లాడతను. ముంబై జెర్సీలోనే నేలపై కూర్చుని భోజనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

రోహిత్ శర్మ డిజాస్టర్ టూర్
రోహిత్ శర్మ డిజాస్టర్ టూర్

తన స్నేహితుడు మనీష్ స్వయంగా వండిన మటన్ వంటకాన్ని సూర్యకుమార్ ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. "మనీష్ భాయ్ మా కోసం ప్రత్యేకంగా మటన్ వండాడు. ఇక్కడ భోజనం చేస్తోంటే మా ఇంటి వాతావరణం, అమ్మ వండిన వంటకాల రుచి గుర్తుకొస్తోంది.." అని సూర్య ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు పొందినప్పటికీ, నిరాడంబరంగా నేలపై కూర్చుని మటన్ భోజనాన్ని ఆస్వాదించడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవలి కాలంలో భారత టీ20 జట్టు కెప్టెన్సీతో పాటు జాతీయ జట్టులో స్థానాన్ని కోల్పోయిన సూర్యకుమార్‌కు ఈ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఎంతో కీలకంగా మారింది. రంజీ ట్రోఫీ ముంబై జట్టు నుంచి కూడా ఆయనను పక్కన పెట్టడంతో, దేశవాళీ టీ20 టోర్నీ ద్వారానే తిరిగి తన సత్తా చాటుకోవాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ కోసం టీమిండియా తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని, దేశవాళీ క్రికెట్‌లో వరుసగా పరుగులు సాధించి ఫామ్ నిరూపించుకోవడమే ఏకైక మార్గమని బీసీసీఐ వర్గాలు గతంలోనే స్పష్టం చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+