అగ్రెసివ్ బౌలింగ్: లో- స్కోర్ మ్యాచ్ ను కాపాడిన టీమిండియా బౌలర్లు

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మౌంట్ మాంగనుయ్‌ లో జరిగిన అయిదో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 22 పరుగుల తేడాతో కివీస్ ను మట్టి కరిపించింది. ఈ లో- స్కోర్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు మ్యాచ్ ను గెలిపించారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో జట్టుకు విజయాన్ని అందించారు. బౌలర్లు సమష్టిగా రాణించారు. బౌలింగ్ కు దిగిన ప్రతి ఒక్కరూ వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో అయిదు మ్యాచ్ ఈ సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. ఇషాన్ కిషన్- 46, అక్షర్ పటేల్- 46 మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జట్టు అగ్రశ్రేణి బ్యాటర్లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయి నిరాశపరిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ 7 పరుగులకే ఔట్ కాగా, విరాట్ కోహ్లీ 5 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 18 పరుగులకే నిష్క్రమించారు.

India put in a fantastic bowling effort to defend a low total 209 and win fifth ODI on New Zealand

దీంతో భారత్ 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 22 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ సమయంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన ఆటతీరుతో జట్టును ఆదుకున్నారు.

హైదరాబాద్, ఏపీ నుంచి కొల్లం ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
హైదరాబాద్, ఏపీ నుంచి కొల్లం ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. టీమిండియా బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. నాలుగో మ్యాచ్ సెంచరీ హీరో విల్ యంగ్ 22 పరుగులకే అవుట్ అయ్యాడు. టిమ్ సెఫర్ట్- 14, నిక్ కెల్లి- 24, డీన్ ఫాక్స్ క్రాఫ్ట్- 31, ఫిన్ అల్లెన్- 1, మైఖెల్ బ్రేస్ వెల్- 19, మిఛెల్ శాంట్నర్- 24, క్రిస్టియన్ క్లార్క్- 16, బ్లెయిర్ టెక్నర్- 16, జాకబ్ డఫీ- 9, మాథ్యూ ఫిషర్-3 (నాటౌట్).. ఇలా ఏ ఒక్కరు కూడా భారీ స్కోర్లు సాధించలేకపోయారు.

ఫ్రెండ్ ఇంట్లో సూర్యకుమార్ యాదవ్: మాంఛి మటన్ మసాలా, పూరీ కాంబో
ఫ్రెండ్ ఇంట్లో సూర్యకుమార్ యాదవ్: మాంఛి మటన్ మసాలా, పూరీ కాంబో

న్యూజిలాండ్ ను భారత బౌలర్లు ఆరంభం నుంచే తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. క్రీజ్ లో కట్టిపడేశారు. దీంతో ఒత్తిడికి గురైన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

రోహిత్ శర్మ డిజాస్టర్ టూర్
రోహిత్ శర్మ డిజాస్టర్ టూర్

అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ సిరీస్ లో మొదటి వన్డే ఆడుతున్న మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చాడీ హైదరాబాదీ పేసర్. అక్షర్ పటేల్-2, అకిబ్ నబీ, యష్ ఠాకూర్, నమన్ ధీర్ ఒక్కో వికెట్ కూల్చారు. వన్డే సిరీస్ ముగియడంతో ఇక ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 19న జరుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+