యుద్ధంతో సర్వం కోల్పోయిన ఆ ముస్లిం దేశం.. కిడ్నీ, లివర్, వృషణాలు అమ్ముకుంటున్న ప్రజలు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం ఆగడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశంతో ఇరాన్ దీర్ఘకాలికంగా యుద్ధం జరుపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఇప్పుడు ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. ఓవైపు నిరుద్యోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు.. తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు కిడ్నీలు, లివర్, వృషణాలను అమ్మకానికి పెట్టారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ ముస్లిం దేశం ఉందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరాన్ ప్రజలు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గణనీయంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అప్పుల బాధలు.. తదితర సమస్యలతో ఇరాన్ ప్రజల జీవనం స్తంభించింది. ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇరాన్ లోని కొంతమంది ప్రజలు తమ శరీర భాగాలను అమ్మకానికి పెట్టినట్లు తాజాగా ఓ సంచలన నివేదిక ద్వారా స్పష్టం అవుతోంది. కిడ్నీలు, బోన్ మ్యారో, వృషణాలు, లివర్ తదితర ముఖ్యమైన శరీర భాగాలను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇరాన్ ఇంటర్నేషనల్ అనే న్యూస్ అవుట్ లెట్ జరిపిన రీసెర్చ్ ప్రకారం ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ మధ్యలో టెలిగ్రామ్ ఛానల్ లో దాదాపు 600లకు పైగా ఆర్గాన్ సేల్ కు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. ఈ ఆర్గాన్ సేల్ లో కిడ్నీలను ఎక్కువగా ఇచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపించినట్లు సమాచారం.

ఇక బోన్ మ్యారో ను ఇచ్చేందుకు 279 మంది ఆసక్తి చూపించారు. లివర్ టిష్యూను అమ్మేందుకు 51 మంది.. అలాగే 15 మంది తమ వృషణాలను, రెండు కార్నియాలను విక్రయించేందుకు సిద్ధపడటం గమనార్హం. ఇదే విషయంపై ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తాను చాలా పార్ట్స్ అమ్మేశానని.. అందులో ఓ వృషణం కూడా ఉందన్నారు. ఈ శరీర అవయవాలు లేకపోయినా తాను జీవించగలనని చెప్పడం అక్కడివారిని కలచివేస్తోంది. ఇక యుద్ధం కారణంగా చాలామంది ప్రజలు తమ బిజినెస్ లు పూర్తిగా ఆగిపోయి.. నష్టాలను చూస్తున్నారు. అలాగే రెంట్స్, అప్పులు తీర్చలేక.. పిల్లలకు మంచి సదుపాయం కల్పించలేక శరీర అవయవాలను విక్రయానికి పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ లో ద్రవ్యోల్బణం అక్టోబర్ నాటికి 89 శాతానికి చేరుకుంది.

Iran inflation has reached extreme levels people selling their kidneys testicles liver tissue

మరోవైపు ఇరాన్ ప్రజలు తమ రోజూవారీ ఖర్చుల కోసం తమ జుట్టును, వ్యక్తిగత పరికరాలను, వినియోగించిన ఫెర్మ్యూమ్ బాటిల్స్ ను విక్రయిస్తున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ఫిబ్రవరిలో ప్రారంభం కాగా ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామోనని ఇరాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+