చంద్రబాబుతో షర్మిల భేటీ..! తప్పకుండా రావాలంటూ..!
ఏపీ సీఎం చంద్రబాబుతో ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (Ys Sharmila) భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు నివాసానికి వచ్చిన షర్మిల.. తన కుమార్తె వైఎస్ అంజిలీ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. తన కుమార్తె పెళ్లికి తప్పకుండా రావాలని సీఎం చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబును తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించినట్లు షర్మిల స్వయంగా వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తన నివాసంలో కలిసి నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి ల వివాహ మహోత్సవానికి విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించడం జరిగిందని వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ పెళ్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు పలువురు ప్రముఖుల్ని షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అయితే అన్న వైఎస్ జగన్ ను మాత్రం ఆమె ఆహ్వానించడం లేదు.

బెంగళూరులోని యలహంకలో ఉన్న వైఎస్ జగన్, షర్మిల ఉమ్మడి నివాసంలో తన కుమార్తె పెళ్లి నిర్వహించేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి నిమిషంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ అక్కడ వద్దంటూ షర్మిలను జగన్ నిరాశపరిచారు. దీనిపై ఎక్స్ లో ఆమె స్వయంగా తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి ఈ విషయాన్ని కూడా తమ ప్రచారానికి వాడుకుంది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ విషయంలో జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో షర్మిల.. సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రిక అందించడం విశేషం.













Click it and Unblock the Notifications
