ఏపీలో మున్సిపల్ పోరుకు కూటమి సీట్లు ఖరారు..! బీజేపీ అభ్యర్ధుల ప్రకటన..!

ఏపీలో త్వరలో జరిగే రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు అధికార కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇవాళ ఈ మేరకు స్పష్టత వచ్చింది. దీంతో రెండో దశ పోరులో తమ పార్టీ పోటీ చేస్తున్న చోట్ల అభ్యర్ధుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ జాబితా విడుదల చేశారు. తొలి విడత మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయాలు సాధించిన కూటమి .. (TDP Alliance) ఈసారి కూడా దాన్ని రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది.

ఏపీ మున్సిపల్ పోరులో అనూహ్య ఫలితాలు ? మారిన ఎడ్జ్ -తాజా సర్వే-ప్రాంతాల వారీగా..!
ఏపీ మున్సిపల్ పోరులో అనూహ్య ఫలితాలు ? మారిన ఎడ్జ్ -తాజా సర్వే-ప్రాంతాల వారీగా..!

రాష్ట్రంలో ఈ నెల 26న జరిగే మున్సిపల్ ఎన్నికల రెండో దశలో బీజేపీకి ఓ కార్పోరేషన్ తో పాటు రెండు మున్సిపాలిటీలు ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దీని ప్రకారం రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు కావలి, బాపట్ల మున్సిపాలిటీలను ఆ పార్టీకి కేటాయించారు. దీంతో ఈ మూడు సీట్లలో బీజేపీ అభ్యర్ధుల్ని ప్రకటించింది. రాజమండ్రి మేయర్ స్ధానానికి బీజేపీ అభ్యర్ధిగా రేలంగి శ్రీదేవిని ఎంపిక చేశారు. అలాగే కావలిలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధిగా గుండ్లపల్లి భరత్ కుమార్, బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధిగా ఇస్క సునీల్ కుమార్ ను ఖరారు చేశారు.

Municipal Polls TDP Alliance Finalises Seat-Sharing for Second Phase BJP Announces Candidates
రాజమండ్రిలో కాకినాడ సీన్ రిపీట్ ? మేయర్ పోరులో బీజేపీలో బిగ్ టెన్షన్..!
రాజమండ్రిలో కాకినాడ సీన్ రిపీట్ ? మేయర్ పోరులో బీజేపీలో బిగ్ టెన్షన్..!

తొలి దశ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తీసుకున్న ఏకైక మేయర్ సీటు అనంతపురంలో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. కూటమి పార్టీల మద్దతు ఉన్నా బలహీనమైన అభ్యర్ధిని బరిలోకి దించిన బీజేపీ.. ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ తప్పిదాన్ని రాజమండ్రిలో పునరావృతం కాకుండా రేలంగి శ్రీదేవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ మేయర్ స్ధానంలో జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో టీడీపీ అభ్యర్ధినే నిలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో బీజేపీకి బలమైన అభ్యర్ధి దొరక్కపోతే టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం మధ్య రేలంగి శ్రీదేవి అభ్యర్దిత్వాన్ని ఖరారు చేశారు. ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి పార్టీలపై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+