బీజేపీకి కడప జెడ్పీ పీఠం, జనసేనకు దక్కేవి ఇవే - కూటమి సీట్ల సర్దుబాటు ఇలా..!!
జెడ్పీ స్థానాల పై కూటమి పార్టీల మధ్య అంగీకారం దాదాపు కుదిరింది. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనే అంశం పైన ఏకాభిప్రాయానికి వచ్చారు. రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్ ల్లో కూటమికి 27 దక్కాయి. వైసీపీకి అల్లూరి సీతారామరాజు జిల్లా ఛైర్మన్ పీఠం దక్కింది. ఇక.. 27 స్థానాల్లో బీజేపీకి కడప జెడ్పీ పీఠం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా జనసేనకు అయిదు స్థానాలు దక్కనున్నాయి. వీటి పైన తుది కసరత్తు కొనసాగుతోంది. ఈ రోజు లేదా రేపు కూటమి పార్టీల మధ్య జెడ్పీ స్థానాల ఖరారు పైన అధికారిక ప్రకటన చేయనున్నారు.
జిడ్పీ స్థానాల పైన కూటమిలో స్పష్టత వచ్చింది. జనసేనకు అయిదు, బీజేపీకి ఒక జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానం దక్కనుంది. కడప జెడ్పీ సీటు బీజేపీకి ఇవ్వగా.. జనసేనకు కేటాయింపులు పూర్తయ్యాయి. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ స్థానాలు అధికారికంగా ఖరారు కానున్నాయి. మొత్తం 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాల్లో కూటమికి 27 దక్కనున్నాయి. అల్లూరి జిల్లా వైసీపీకి దక్కనుంది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు జనసేనకు పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే, అల్లూరి సీతారామ రాజు వైసీపీకి వెళ్లటంతో ఆ స్థానంలో మరో జిల్లా కేటాయించనున్నారు. అదే విధంగా తిరుపతి జిల్లా వైస్ ఛైర్మన్ పోస్టు జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాగా.. బీజేపీకి కడప జిల్లా జెడ్పీ పీఠం దక్కనుంది.

కూటమి చర్చలు కొలిక్కి.. లెక్కలు ఖరారు
బీజేపీకి తొలుత జెడ్పీ పీఠం విషయంలో అనేక చర్చలు జరిగాయి. కడప జిల్లా విషయంలో బీజేపీ నేతలు పట్టు బట్టారు. అక్కడ వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అది నారాయణ రెడ్డి సోదరుడు కుమారుడికి కడప జెడ్పీ పీఠం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా నుంచి పలువురు టీడీపీ నేతలు రేసులో ఉన్నారు. అయితే, భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా ఈ సీటు ను బీజేపీ కోటాలో ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి ఈ పదవి కేటాయిస్తారని సమాచారం. ఈ రోజు లేదా రేపు కూటమి పార్టీల మధ్య జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాల పైన ప్రకటన చేయనున్నారు. పార్టీల మధ్య లాస్ట్ మినిట్ లో ఏమైనా మార్పులు జరిగితే మినహా.. ఇవే స్థానాలు ప్రకటించటం లాంఛనంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
