"వైసీపీకి మంచి రోజులొచ్చాయ్..అమాంతం పెరిగిన గ్రాఫ్ ?"-టీడీపీ సర్వేయర్ సంచలనం..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అలాగే తొలి దశ పంచాయతీ ఎన్నికలు కూడా ముగిశాయి. మరో రెండు దశల పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలో పూర్తి కాబోతున్నాయి. దీంతో స్థానిక సంస్దల ఎన్నికలు దాదాపు ముగిసినట్లే. అయితే తాజాగా జరిగిన తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యం సాధించినట్లు కూటమి పార్టీలు జబ్బలు చరుచుకుంటున్నా.. విపక్ష వైసీపీ (YSRCP) కూడా అనూహ్యంగా పుంచుకుందంటూ టీడీపీ అనుకూల సర్వే నిపుణుడిగా పేరున్న రైజ్ సర్వే సంస్ధ అధినేత ప్రవీణ్ పుల్లట (Praveen Pullata) సంచలన ట్వీట్ చేశారు.
పంచాయతీలో వైసీపీ ఎందుకు అమాంతం పుంజుకుంది? అంటూ ఆయన ఇవాళ కీలక ప్రశ్న వేశారు. వైసీపీ స్థానిక నేతలు పోరాటాలు చేశారని కాదు, ఎమ్మెల్యేల అవినీతి, క్యాడర్ కి ఎమ్మెల్యేకి కనెక్టివిటీ తెగిపోవడం, సంపాదనపై శ్రద్ధ, రైతుల పట్ల అశ్రద్ధ, అడుగడుగునా కమీషన్లు, ..ఇలా సవాలక్ష కారణాలు దీని వెనుక ఉన్నాయని ప్రవీణ్ విశ్లేషించారు. సహజంగా పెన్షన్ తీసేస్తారని చిన్న చిన్న వాటికే భయపడే సామాన్య ప్రజానీకం ఎందుకు ఆగ్రహంతో ఏకమైంది? ఆత్మ పరిశీలన చేసుకుంటే సరి అంటూ కూటమి పార్టీలకు ఆయన చురకలు అంటించారు.

పంచాయతీలో వైసీపీ ఎందుకు అమాంతం పుంజుకుంది? వైసీపీ స్థానిక నేతలు పోరాటాలు చేశారని కాదు. ఎమ్మెల్యేల అవినీతి, క్యాడర్ కి ఎమ్మెల్యేకి కనెక్టివిటీ తెగిపోవడం, సంపాదనపై శ్రద్ధ, రైతుల పట్ల అశ్రద్ధ, అడుగడుగునా కమీషన్లు, ..ఇలా సవాలక్ష కారణాలు. సహజంగా పెన్షన్ తీసేస్తారని చిన్న చిన్న వాటికే భయపడే సామాన్య ప్రజానీకం ఎందుకు ఆగ్రహంతో ఏకమైంది? ఆత్మ పరిశీలన చేసుకుంటే సరి. పెట్టుబడుల మాట దేవుడెరుగు.. అధిక ధరలు, రెవెన్యూ రొటేట్ కాకపోవడం, కొనుగోలు శక్తి పడిపోవడం..ఇలా సామాన్యుల కష్టాలు లైట్ తీసుకుంటే ఇంకా ఇంతే సంగతులు. లేదు విజయ దుందుభి మోగించాం కదా అంటే 🙏వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే! ఆ పార్టీ క్యాడర్ ఐతే ఈ ఎలక్షన్ వరకు గట్టిగా నిలబడింది.#ఏపీపంచాయతీ
— Praveen Pullata (@praveenpullata) November 27, 2026
పెట్టుబడుల మాట దేవుడెరుగు.. అధిక ధరలు, రెవెన్యూ రొటేట్ కాకపోవడం, కొనుగోలు శక్తి పడిపోవడం..ఇలా సామాన్యుల కష్టాలు లైట్ తీసుకుంటే ఇంకా ఇంతే సంగతులు అని ప్రవీణ్ పుల్లట కూటమి ప్రభుత్వానికి తేల్చిచెప్పేశారు. లేదు విజయ దుందుభి మోగించాం కదా అంటే .. అని దండం పెట్టేశారు. చివరిగా వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే! ఆ పార్టీ క్యాడర్ ఐతే ఈ ఎలక్షన్ వరకు గట్టిగా నిలబడిందంటూ ప్రవీణ్ పుల్లట ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం జగన్ పిలుపును సీరియస్ గా తీసుకుని వైసీపీ అభ్యర్ధులు గట్టిగా నిలబడి పోటీ ఇచ్చారనే విశ్లేషణలు వినిపిస్తున్న వేళ.. టీడీపీకి అనుకూలంగా ఉంటారనే పేరున్న సర్వే నిపుణుడు సైతం ఇదే విశ్లేషణ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.













Click it and Unblock the Notifications
