రాజమండ్రిలో కాకినాడ సీన్ రిపీట్ ? మేయర్ పోరులో బీజేపీలో బిగ్ టెన్షన్..!

ఏపీలో రెండో విడత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ కీలకమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాట్లలో భాగంగా కాకినాడ మేయర్ సీటను జనసేనకు, రాజమండ్రి మేయర్ సీటును (Rajamahendravaram mayor) బీజేపీకి టీడీపీ కేటాయించింది. అయితే కాకినాడలో తాజా పరిణామాల్లో టీడీపీయే తిరిగి పోటీ చేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఇప్పుడు రాజమండ్రిలోనూ అదే సీన్ కనిపిస్తోంది.

ఏపీ మున్సిపల్ పోరులో అనూహ్య ఫలితాలు ? మారిన ఎడ్జ్ -తాజా సర్వే-ప్రాంతాల వారీగా..!
ఏపీ మున్సిపల్ పోరులో అనూహ్య ఫలితాలు ? మారిన ఎడ్జ్ -తాజా సర్వే-ప్రాంతాల వారీగా..!

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈసారి మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ కార్పోరేషన్ ను జనసేనకు కేటాయించారు. అయితే జనసేన నిలబెట్టాలని భావించిన అభ్యర్ధులపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బలమైన అభ్యర్ధిని నిలబెట్టకపోతే కాకినాడ కార్పోరేషన్ ను వైసీపీకి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో జనసేన సదరు బలమైన అభ్యర్ధుల కోసం తీవ్రంగా గాలించింది. అయినా ఫలితం లేదు. దీంతో చివరికి కాకినాడ మేయర్ సీటులో పోటీ నుంచి తాము తప్పుకుని టీడీపీకి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు అన్న కూతురు లేదా మరో మహిళా అభ్యర్ధిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

BJP Forced to Give Up Rajamahendravaram Mayor Candidature to TDP Is the Kakinada Episode Repeating Itself
జగన్ ఫ్యామిలీపై జనసైనికుల రోత వ్యాఖ్యలు- ఏపీ మహిళా కమిషన్ ఫైర్..!
జగన్ ఫ్యామిలీపై జనసైనికుల రోత వ్యాఖ్యలు- ఏపీ మహిళా కమిషన్ ఫైర్..!

మరోవైపు రాజమండ్రి సీటులోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. రాజమండ్రి మేయర్ సీటును కూటమి పంపకాల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. అయితే బీజేపీ నిలబెట్టాలనుకుంటున్న అభ్యర్ధుల విషయంలో టీడీపీ తీవ్ర అసంతృప్తిగా ఉంది. దీంతో అభ్యర్ధిని మార్చాలంటూ బీజేపీపై ఒత్తిడి పెంచుతోంది. ఎన్నికల ఖర్చు భరించలేరనే కారణాన్ని తెరపైకి తెస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అంత బలమైన అభ్యర్ధులు దొరకడం లేదు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి టీడీపీ చేతికే మేయర్ అభ్యర్ధి పోటీని అప్పగించాల్సిన పరిస్ధితి బీజేపీకి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కాకినాడ తరహాలో టీడీపీయే ఇక్కడ పోటీ చేస్తే పరిస్ధితి ఎలా ఉంటుందన్న దానిపై కూటమి పార్టీల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఈ వ్యవహారంపై క్లారిటీ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+