కాకినాడ మేయర్ పీఠం దక్కేదెవరికి - కీలక పరిణామాలు, కొత్త లెక్కలు..!?
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలి విడతలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీకి అనంతపురం మాత్రమే దక్కింది. ఇప్పుడు నాలుగు కార్పోరేషన్లు.. 19 మున్సిపాల్టీలకు ఈ సీనెల 19న పోలింగ్ జరగనుంది. అందులో శ్రీకాకుళం, కాకినాడ పైన వైసీపీ ప్రత్యేకంగా గురి పెట్టింది. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన ఇక్కడ పోటీ చేయనుంది. అయితే, తాజా పరిణామాలతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తుండటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
కాకినాడ సహా నాలుగు కార్పోరేషన్లలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. కూటమి పొత్తుల్లో భాగం గా కాకినాడ కార్పోరేషన్ మేయర్ సీటు జనసేనకు కేటాయించారు. మిగిలిన మూడు కార్పోరేషన్లలో శ్రీకాకుళం, రాజమండ్రి, తాడేపల్లి - మంగళగిరి నుంచి టీడీపీ పోటీ చేయనుంది. అయితే, కాకినాడ లో ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. వార్డుల్లొనూ అభ్యర్ధులను ఫైనల్ చేయటంతో నామినేషన్లు దాఖలుకు సిద్దమయ్యారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాద వెంకటరమణ తన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే సమయంలో కాకినాడ పార్టీ మేయర్ అభ్యర్దిగా కాద సత్యశ్రీని జగన్ ప్రకటించారు. నగరంలో పేరున్న వైద్యుల కుటుంబం కావటంలో శెట్టి బలిజ వర్గానికి ఇక్కడ వైసీపీ మేయర్ సీటు ఇవ్వటంతో రాజకీయంగా కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

మేయర్ అభ్యర్ది ఖరారు పై కసరత్తు
ఇదే సమయంలో ఈ సీటు జనసేనకు కేటాయించారు. కాగా.. జనసేన ఈ సీటు లో పోటీ చేస్తుందా లేక, ఈ స్థానంలో తూర్పు గోదావరి జెడ్పీ ఛైర్మన్ సీటు తీసుకుంటుందా అనేది ఇప్పుడు పార్టీలో కొందరు నేతల్లో చర్చ జరుగుతోంది. జనసేన నుంచి గుత్తుల వెంకట శుభ, చోల్లంగి సుబ్బలక్ష్మి, కడలి ఈశ్వరి రేసులో ఉన్నారు. ఇక.. జనసేన పెద్ద సంఖ్యలో వార్డులు కోరుతోంది. అయితే.. కాకినాడ తమకు కంచుకోటగా భావిస్తున్న జనసేన మేయర్ సీటు సొంతం చేసుకుంటామని ధీమాగా ఉంది. కాకినాడలో ఆరు పంచాయితీలు కొత్తగా కార్పోరేషన్ లో చేరాయి. టీడీపీకి మేయర్ సీటు దక్కితే స్థానిక ఎమ్మెల్యే బంధువులకే కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కూటమితో పాటుగా వైసీపీకి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ పరిణామాల వేళ కాకినాడ మేయర్ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.













Click it and Unblock the Notifications
