ఏపీ మున్సిపల్ పోరులో అనూహ్య ఫలితాలు ? మారిన ఎడ్జ్ -తాజా సర్వే-ప్రాంతాల వారీగా..!
ఏపీలో త్వరలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తొలి దశలో 100 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన 23 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగు కార్పోరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఆముదాలవలస, అల్లూరు, రాజాం, బి. కొత్తపేట, తాడిగడప, భీమవరం, తణుకు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, గుడివాడ,, చింతలపూడి, నరసరావుపేట, పొన్నూరు, బాపట్ల, కందుకూరు, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి ఉన్నాయి. ఈ నెల 26న ఆయా చోట్ల ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.
ఈ నెలాఖరులో జరిగే 19 మున్సిపాలిటీల ఎన్నికల్లో ప్రజల మొగ్గు మారినట్లు సీ-ప్యాక్ సంస్థ తన తాజా సర్వేలో (C-PAC Survey) వెల్లడించింది. ఇప్పటికే ఈ మేరకు ఫలితాలు ప్రకటించిన సీ-ప్యాక్ ఈసారి 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా ఎవరికి మొగ్గు ఉందో తెలిపింది. అయితే సీట్ల వారిగా ఈ వివరాలను మాత్రం వెల్లడించలేదు. సీ-ప్యాక్ తాజా సర్వే ప్రకారం చూస్తే ఈ 19 సీట్లలో తొలి విడత మున్సిపల్ ఎన్నికల తరహాలో అధికార కూటమికి బదులు విపక్ష వైఎస్సార్సీపీ పుంజుకున్నట్లు అంచనా వేస్తోంది.

మొత్తం 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 10 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశం ఉందని సీ-ప్యాక్ సర్వే చెబుతోంది. మరో 7 చోట్ల టీడీపీ, ఇంకో రెండు చోట్ల ఆ పార్టీ మిత్రపక్షం జనసేన విజయం సాధిస్తుందని వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకుంటే.. ఉత్తరాంధ్రలో ఉన్న రెండు సీట్లలోనూ వైఎస్సార్సీపీ గెలువబోతున్నట్లు చెబుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న 15 సీట్లలో ఆరు సీట్లు వైసీపీ, మరో 7 సీట్లు టీడీపీ, రెండు సీట్లు జనసేన గెల్చుకుంటున్నట్లు తెలిపింది. ఇక రాయలసీమలోని రెండు సీట్లలోనూ వైసీపీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తద్వారా కోస్తాంధ్రలో వైసీపీ 100 శాతం బలం పుంజుకుందని ఈ సర్వే నివేదిక చెబుతోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది ఈ నెలాఖరులో తేలిపోనుంది.














Click it and Unblock the Notifications
