మాట్లాడాలని ట్రయల్ రూమ్‌ లోకి పిలిచి.. 18 ఏళ్ల యువతి గొంతు కోసి.. ఏమైందంటే..?

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న 18 ఏళ్ల యువతి దారుణమైన హత్యకు గురైంది. ఓ గుర్తు తెలియని దుండగుడు మాట్లాడదామని ట్రయల్ రూమ్ లోకి పిలిచి అక్కడే గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఆ షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇక ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ హత్యకు గల కారణం వన్ సైడ్ లవ్ లేదా వ్యక్తిగత కక్షలే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దేశ రాజధాని దిల్లీలో మరోసారి మహిళల భద్రతపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిశ, నిర్భయ లాంటి కఠినమైన చట్టాలను తీసుకొచ్చిన అమ్మాయిలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మాయిలపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..?

దేశ రాజధాని దిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో షబ్నమ్ (18) అనే యువతి పనిచేస్తోంది. పశ్చిమ దిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. అయితే షబ్నమ్ కు సూరజ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం షబ్నమ్ షిఫ్ట్ ముగించుకుని వెళ్లిపోయే సమయానికి సూరజ్ అక్కడకు వచ్చాడు. మట్లాడాలని ఆమెను ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడే యువతి గొంతు కోసి ట్రయల్ రూమ్ తలుపుకు బయట నుంచి గడియ పెట్టి వెళ్లిపోయాడు.

Delhi Shocking incident man took young girl into a trial room then slit her throat and killed her

ఇక రోజూ మాదిరిగానే రాత్రి 9 గంటల సమయంలో షోరూమ్‌ సిబ్బంది దుకాణం మూసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ట్రయల్‌ రూమ్‌ లను తనిఖీ చేశారు. అయితే ఓ రూమ్ లో షబ్నమ్‌ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+