NCD 4.0 సర్వే ఫలితాలు.. ఏపీలో డయాబెటిస్, హైబీపీ బాధితుల లెక్క ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NCD 4.0 ద్వారా కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు, 11,58,632 మందికి మధుమేహం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. నోటి క్యాన్సర్ లో 3,339, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 9,171 వెలుగు చూశాయి. రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.85 కోట్ల మందికి బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార పరీక్షలు నిర్వహించారు.

ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం బీపీతో ఉన్నవారు 59.63 లక్షలు, మధుమేహంతో ఉన్నవారు 48.95 లక్షల మంది ఉన్నారు. ఈ 1,08,58,000 మందిలో బీపీ+షుగర్
కలిగి ఉన్న వారు రాష్ట్రoలో 34 లక్షల మంది ఉన్నారు. అలాగే 3,339 నోటి క్యాన్సర్, 5,832 రొమ్ము క్యాన్సర్, 3,597 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులను గుర్తించారు. సర్వే ఫలితాల నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సమర్పించారు.

NCD Survey 4 0 12 23 Lakh New Hypertension Cases 11 58 Lakh Diabetes Cases Detected in State

ఈ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నవంబర్ 10న సర్వే ముగిసింది. గ్రామ, వార్డు స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించారు. దీనికోసం 40 వేల మంది ఆశా కార్యకర్తలకు, 22 వేల మందికి పైగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు, స్టాఫ్ నర్సులు, వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు.

500 మందికి పైగా ఎన్‌సీడీ క్లినిక్‌ల సిబ్బందికి, ద్వితీయ స్థాయి ఆసుపత్రులకు చెందిన 550 మంది వైద్య నిపుణులకు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల క్యాన్సర్ నివారణ విభాగాలకు చెందిన 150 మంది నిపుణులకు కార్యక్రమంపై అవగాహన కల్పించారు.రాష్ట్రoలో ఉన్న 18 ఏళ్లు దాటిన జనాభా లెక్కల (4.2 కోట్లు) ప్రకారం..13.93 శాతం మందికి అధిక రక్తపోటు, 11.45 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు.

జిల్లాల వారీగా బీపీ, మధుమేహం గుర్తింపులో తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలు బీపీ కేసుల్లో ముందున్నాయి. మధుమేహం కేసుల్లో తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, ఏలూరు జిల్లాలు ముందున్నాయి. ఈ NCD-4.0 సర్వే ద్వారా మాత్రమే కొత్తగా గుర్తించిన బీపీ కేసుల సంఖ్యలో విశాఖపట్నం (78,017), పశ్చిమగోదావరి (68,802), తిరుపతి (65,504), తూర్పుగోదావరి (64,116), వైఎస్సార్ కడప (63,141) జిల్లాలు ముందున్నాయి.

మధుమేహం కేసుల్లో విశాఖపట్నం (80,692), పశ్చిమగోదావరి (67,935), తిరుపతి (67,827), వైఎస్సార్ కడప (66,914), ప్రకాశం (61,415) జిల్లాలు ముందున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలోనే అధికంగా బీపీ, మధుమేహం కేసులు ఉన్నాయి. అధిక రక్తపోటు కేసుల్లో 47.60 శాతం.. మధుమేహం కేసుల్లో 43.39 శాతం ఆ వయస్సు వారే ఉన్నారు.
50-59 ఏళ్ల వయస్సు వారిలోనూ ఈ రెండు వ్యాధుల కేసులు అధికంగా గుర్తించారు.

 సర్పంచ్ పదవి రూ.81 లక్షలు.. పల్నాడులోని ఆ ఊరికి మామూలు డిమాండ్ కాదు!
సర్పంచ్ పదవి రూ.81 లక్షలు.. పల్నాడులోని ఆ ఊరికి మామూలు డిమాండ్ కాదు!

క్యాన్సర్ కేసులను కూడా ఈ సర్వేలో గుర్తించారు. 3,597 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి వ్యాధుల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, వాటి తీవ్రత పెరగకుండా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్ కేసులను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాధులు గుర్తించిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+