ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ తెలుగు కామెడీ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది బైసన్, కిష్కిందపురి, పరదా లాంటి చిత్రాలతో అలరించారు. ఈ ఏడాది 'క్రేజీ కల్యాణం' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ కూడా కీలక పాత్రలో మెరిశారు. అయితే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

ఈ మేరకు తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ఆహా వేదికగా నవంబర్ 20, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలోనూ ఈ సినిమా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. క్రేజీ కల్యాణం మూవీకి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ తోపాటు నరేష్, అఖిల్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Anupama Parameswaran movie Crazy Kalyanam is heading to OTT streaming on Aha starting November 20

క్రేజీ కల్యాణం మూవీ స్టోరీ విషయానికి వస్తే..

మెదక్ జిల్లాలోని ఓ పల్లెటూరిలో జీవనం సాగిస్తున్న పర్వతాలు (నరేశ్)కు ఇద్దరు కుమార్తెలు. అయితే పెద్ద కుమార్తెకు బాలరాజు (తరుణ్ భాస్కర్)తో వివాహం జరుగుతుంది. అయితే బాలరాజు తాగుడుకు బానిసై ఊరిలో అప్పులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పర్వతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అయితే తన చిన్న కుమార్తెకు ఎలాగైనా మంచి సంబంధం చూసి వివాహం చేయాలని అనుకుంటాడు. ఈ మేరకు అమెరికాలో స్థిరపడిన ఓ యువకుడితో వివాహం నిశ్చయిస్తాడు. కానీ కీర్తి మాత్రం తన కాలేజీ ఫ్రెండ్ అయిన ఉదయ్ (అఖిల్ రాజ్)ను లవ్ చేస్తుంది. అయితే తండ్రి మాత్రం తాను చూసిన సంబంధానికే పెళ్లి చేయాలని పట్టుబడతాడు. మరి కీర్తి తన ప్రేమను గెలిపించుకుందా..? తండ్రి మాట ప్రకారం పెళ్లి చేసుకుందా..? అనేది సినిమాలో చూడాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+