ఐసీసీ వరల్డ్ కప్ రిటర్న్స్ టు ఇండియా: ఐసీసీ గ్రేట్ న్యూస్

భారత క్రికెట్ అభిమానులకు ఐసీసీ తీపి కబురు అందించింది. కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ మళ్లీ భారత్‌కు రానుంది. 2031లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్‌కు భారత్, బంగ్లాదేశ్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అంతేకాకుండా 2029లో నిర్వహించబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను కూడా భారత్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది.

2028 నుంచి నాలుగేళ్ల కాలానికి.. అంటే 2031 వరకు ఐసీసీ తన రాబోయే ప్రధాన టోర్నమెంట్ల క్యాలెండర్‌ను కొద్దిసేపటి కిందటే అధికారికంగా విడుదల చేసింది. ఈ తాజా వివరాల ప్రకారం 2029 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 28 వరకు భారత్ లోనే జరగనున్నాయి. ఆ తర్వాత 2031 అక్టోబర్ 9 నుండి నవంబర్ 23 వరకు వన్డే ప్రపంచకప్ టోర్నీ భారత్, బంగ్లాదేశ్‌లలోని వివిధ స్టేడియాల్లో నిర్వహిస్తారు.

ODI World Cup will be returning to India in 2031 as ICC Board has approved windows with Bangladesh

గతంలో 2023లో భారత్ సొంతంగా వన్డే వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ టోర్నమెంట్ ఫైనల్ లో ఓడిపోయింది టీమిండియా. ఆస్ట్రేలియా ఛాంపియన్ గా నిలిచిందప్పట్లో. ఇప్పుడు 2031లో పొరుగు దేశం బంగ్లాదేశ్‌తో కలిసి మరోసారి ఈ మెగా టోర్నమెంట్ ను నిర్వహించాల్సి ఉంటుంది. 2023 తర్వాత మళ్లీ ఐసీసీ వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించబోతోండటం ఇదే మొదటిసారి అవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రేజ్ మరింత పెంచడానికి ఐసీసీ 2028 నుండి 2035 వరకు జరగాల్సిన వివిధ టోర్నీల సుదీర్ఘ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా 2028 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే 2029, 2031 సంవత్సరాల్లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ వేదికగా నిలవనుంది. ఇక 2030 టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ కలసికట్టుగా ఆతిథ్యం ఇస్తాయి.

  • 2028 టీ20 ప్రపంచకప్ 2028 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్: 12 అక్టోబర్- నవంబర్ 12 వరకు
  • 2029 డబ్ల్యూటీసీ ఫైనల్ 2029 ఇంగ్లాండ్ 8- 12 జూన్
  • 2029 ఛాంపియన్స్ ట్రోఫీ 2029 భారత్ 9 నుంచి 28 అక్టోబర్
  • 2030 టీ20 ప్రపంచకప్ 2030 ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ 4 జూలై - 4 ఆగస్టు
  • 2031 డబ్ల్యూటీసీ ఫైనల్ 2031 ఇంగ్లాండ్ 12-16 జూన్
  • 2031 వన్డే ప్రపంచకప్ 2031 భారత్, బంగ్లాదేశ్ 9 అక్టోబర్ - 23 నవంబర్
  • 2032 టీ20 ప్రపంచకప్ 2032 ఖరారు కావాల్సి ఉంది 14 అక్టోబర్ - 14 నవంబర్
  • 2033 డబ్ల్యూటీసీ ఫైనల్ 2033 ఖరారు కావాల్సి ఉంది 9-13 జూన్
  • 2033 ఛాంపియన్స్ ట్రోఫీ 2033 ఖరారు కావాల్సి ఉంది 2-23 అక్టోబర్
  • 2034 టీ20 ప్రపంచకప్ 2034 ఖరారు కావాల్సి ఉంది 6 జూలై - 6 ఆగస్టు
  • 2035 డబ్ల్యూటీసీ ఫైనల్ 2035 ఖరారు కావాల్సి ఉంది 7-11 జూన్
  • 2035 వన్డే ప్రపంచకప్ 2035 ఖరారు కావాల్సి ఉంది 2 అక్టోబర్ - 18 నవంబర్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+