బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను వార్నింగ్.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో 'అక్వాన్' తుపాను బలపడింది. గురువారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారి, శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు - తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ సమయంలో 145 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని.. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు బంగాళాఖాతంలో బలపడిన తుపానుకు అక్వాన్‌ గా నామకరణం చేశారు. ఇక ఏపీ, ఒడిశా తీరప్రాంతాలకు ఆరెంజ్ సైక్లోన్ అలర్ట్ జారీ చేశారు.

తుపాను ప్రస్తుతం చెన్నైకు 610 కి. మీ. అలాగే మచిలీపట్నానికి 660 కి. మీ దూరంలో ఇక విశాఖకు 670 కి. మీ. దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్వాను తుపాను ఈ నెల 19న ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని..ఈ నెల 20న మధ్యాహ్నం నెల్లూరు-తుని మధ్య తీరం దాటనుందని అంచనా వేశారు. అయితేతీరం దాటేటప్పుడు గంటకు 120 కి. మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తుపాను ప్రభావం కారణంగా కోస్తాంధ్రలో ఎల్లుండి నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.

Akwan Cyclone warning in the Bay of Bengal heavy rains expected in Telangana for 3 days latest imd

ఇక బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను హెచ్చరిక కారణంగా తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఈ నెల 19 నుంచి 21 వరకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+