పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం

ఇండోనేషియాలో ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ తీర ప్రాంతాన్ని వణికించింది. దీని తీవ్రత అధికంగా ఉండటం వల్ల మొదట సునామీ సంభవించవచ్చనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ఆ పరిస్థితులు లేకపోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. భూకంప తీవ్రత ధాటికి తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగిసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. 30 సెంటీ మీటర్ల ఎత్తువరకు అలలను ఎగిసిపడినట్లు ఇండోనేషియా బ్రాడ్‌కాస్టర్ మెట్రో టీవీ వెల్లడించింది.

ఇండోనేషియా నైరుతి ప్రాంతంలోని ములుకు ప్రావిన్స్ లోని తువాల్ సిటీ సమీపంలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా రికార్డయింది. భారత కాలమానం ప్రకారం ఈ వేకువజామున 2:41 నిమిషాలకు భూమి ప్రకోపించింది. కై ఐలాండ్స్ లో ఉంటుందీ ములుకు ప్రావిన్స్. దీని రాజధాని తువాల్ సిటీకి నైరుతి దిశగా 144 కిలోమీటర్ల దూరంలో గల బందా సముద్ర ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా యూఎస్జీఎస్ గుర్తించింది.

Earthquake today Magnitude 6 6 on the Richter scale struck in West Pacific Sea of Tual in Indonesia

ప్రారంభంలో ఈ భూకంప తీవ్రతను 7.4 గా అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత దీన్ని 6.6 కు తగ్గించారు. తీవ్రత అధికంగా ఉన్నందున ఇండోనేషియాలోని ద్వీప సముదాయాలు, పొరుగునే ఉన్న ఫిలిప్పీన్స్, మలేషియాల్లో తీర ప్రాంతాలు అలజడికి గురయ్యాయి. భూకంపం సంభవించిన తర్వాత సరిగ్గా 16 నిమిషాల్లో కై ఐలాండ్స్ తీరంలో అలలు 30 సెంటీ మీటర్ల ఎత్తు వరకు ఎగిసినట్లు ఇండోనేషియా బీఎంకేజీ భూగర్భ ప్రయోగాల సంస్థ వెల్లడించింది.

తిరుమలలో టన్నుల కొద్దీ పువ్వులతో..: అదే హైలైట్
తిరుమలలో టన్నుల కొద్దీ పువ్వులతో..: అదే హైలైట్

తువాల్ సిటీతో పాటు ములుకు ప్రావిన్స్ లోని అనేక పలు ఇతర ప్రాంతాలపై దీని ప్రభావం పడింది. జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదవుతోండటంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే జాగారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టంసంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.

ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో ఉండే దేశాల్లో ఇదీ ఒకటి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూగినియా, న్యూజిలాండ్, అంటార్కిటికా- ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+