శబరిమల దర్శనం కోసం వెంట తీసుకెళ్లాల్సినవి: గైడ్ లైన్స్: ఈ 5 రైల్వే స్టేషన్లల్లో హెల్ప్‌డెస్క్

శబరిమల అయ్యప్ప మండల- మకరవిళక్కు యాత్రా కాలం వైభవంగా ప్రారంభమైంది. ఈ తెల్లవారు జామున 3 గంటలకు ప్రత్యేక పూజలతో ఆలయం తలుపులను తెరిచారు. సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తోన్నారు. డిసెంబర్ 27వ తేదీ వరకు మండలం- ఆ తర్వాత 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు మకరవిళక్కు సీజన్ కొనసాగనుంది. ఈ యాత్రా కాలం ఆరంభం కావడంతో కేరళ పతనంతిట్ట కొండల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సన్నిధానానికి తరలివస్తోన్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన వేళలు, ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్, స్పాట్ బుకింగ్ విధానాలు, రవాణా భద్రతపై కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి.

Start Your Sabarimala Pilgrimage Darshan Booking QR Verification Entry Rules and Aravana Rates

ఈ సీజన్‌లో సన్నిధానంలో రోజుకు గరిష్టంగా 80,000 భక్తులకు మాత్రమే దర్శనం లభించేలా పరిమితి విధించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి రోజుకు 18 గంటల పాటు అయ్యప్ప స్వామి దర్శనం కల్పిస్తారు. తెల్లవారు జామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11:00 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శన అవకాశం ఉంటుంది. భక్తులంతా వర్చువల్ క్యూ పాస్ విధానాన్ని పాటించాలని అధికారులు సూచించారు.

నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం: నీలక్కల్, పంబలో స్పాట్ బుకింగ్- ఏర్పాట్లు
నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం: నీలక్కల్, పంబలో స్పాట్ బుకింగ్- ఏర్పాట్లు

శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ సంఖ్య, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోలేని భక్తుల కోసం ప్రత్యేకంగా స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీలక్కల్ వద్ద రోజుకు 10,000, ఎరుమేలి వద్ద 2,000, వండిపెరియార్ వద్ద 2,000 పాస్‌లను జారీ చేస్తున్నారు. పంప వద్ద ఎలాంటి స్పాట్ బుకింగ్ సదుపాయం ఉండదు.

శబరిమల ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికీ రూ. 2 లక్షల డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్
శబరిమల ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికీ రూ. 2 లక్షల డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్

స్పాట్ బుకింగ్ కేంద్రాల వద్ద భక్తుడి ఫోటో తీసి, క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ ఇస్తారు. పంప గణపతి ఆలయం వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ పూర్తయిన తర్వాతే సన్నిధానానికి అనుమతిస్తారు. అందుకే అయ్యప్ప భక్తులు ఒరిజినల్ ఆధార్ కార్డ్ ను తమ వెంట తీసుకెళ్లాలి. నీలక్కల్- పంప మార్గం ద్వారా రోజుకు 60,000 వర్చువల్ క్యూ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎరుమేలి అటవీ మార్గం, వండిపెరియార్-సత్రం మార్గాలకు రోజుకు 3,000 చొప్పున స్లాట్‌లను కేటాయించారు.

తిరుమలలో టన్నుల కొద్దీ పువ్వులతో..: అదే హైలైట్
తిరుమలలో టన్నుల కొద్దీ పువ్వులతో..: అదే హైలైట్

భక్తుల భద్రత కోసం రైల్వే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎక్కువ మంది యాత్రికులు చేరుకునే ఎర్నాకుళం, చెంగన్నూర్, తిరువళ్ల, కొట్టాయం, కాయంకుళం రైల్వే స్టేషన్లలో 24 గంటలూ పనిచేసే పోలీస్ హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రాల ద్వారా ప్రయాణ సమాచారంతో పాటు వైద్య, భద్రతా సేవలు అందిస్తారు. సీసీటీవీ కెమెరాల, అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

యాత్రలో భక్తులకు ఏదైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కావలసి వస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9846200100కు ఫోన్ చేయవచ్చు. అలాగే పోలీసులు- 112, రైల్వే అధికారులు- 139 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి.

సన్నిధానానికి చేరుకున్న భక్తులు శ్రీ అయ్యప్ప స్వామివారి ప్రసాదాలు పొందడానికి, నెయ్యాభిషేకం, పూజా సేవల్లో పాల్గొనడానికి దేవస్వం బోర్డు నిర్దేశించిన ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అరవణ, అప్పం లాంటి ప్రధాన ప్రసాదాల ధరలతో పాటు వివిధ పూజలకు సంబంధించి దేవస్వం బోర్డు ధరలను నిర్ధారించింది.

  • అరవణ ప్రసాదం రూ. 100
  • అప్పం- రూ. 45
  • నెయ్యాభిషేకం- రూ. 10
  • గణపతి హోమం- రూ. 375
  • ఉషా పూజ- రూ. 1,500
  • ఉచ్ఛ పూజ- రూ. 3,000
  • నిత్య పూజ- రూ. 4,000
  • లక్షార్చన / పుష్పాభిషేకం- రూ. 12,500
  • ఉదయశాస్తమాన పూజ- రూ. 61,800
  • పడి పూజ- రూ. 1,37,900
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+