శబరిమల రూపురేఖలు మారబోతున్నాయి.. తిరుమల తరహా మోడల్!
అయ్యప్ప భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కేరళ ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తిరుపతి దేవస్థానం తరహాలో ఒక మెగా ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించారు.
కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CIAL) పరిధిలో ఏర్పాటు చేసిన 'శబరిమల పిల్గ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. కేవలం శబరిమల యాత్రే కాకుండా, దీనిని ఒక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసి ఇతర ప్రముఖ ఆలయాలను కూడా దర్శించుకునేలా భక్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఎయిర్‌పోర్టులోనే అన్నీ సదుపాయాలు
కొచ్చి ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ అరైవల్ టెర్మినల్ సమీపంలో దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విమానాశ్రయం ద్వారా కేరళకు వచ్చే యాత్రికులు ఎంతో సులువుగా ఈ సేవలను పొందేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యం కోసం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా శబరిమలకు కేఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రంలోనే ప్రత్యేకంగా ఒక బుకింగ్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేయగా, భక్తుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక చార్టర్డ్ బస్సులను కూడా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వయంగా సీఎం ఈ బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు.
ఒకే చోట అన్ని సౌలభ్యాలు.. హెలికాప్టర్ బుకింగ్ నుంచి ఫ్రీ వైఫై దాకా!
శబరిమల యాత్రను మరింత సులభతరం చేసేలా ఈ కేంద్రంలో అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పించారు. ప్రధానంగా రాకపోకల సౌలభ్యం కోసం ఈ సీజన్‌లో ప్రత్యేకంగా హెలికాప్టర్ సర్వీసుల బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. వీటితో పాటు ట్రావెవియో దేవస్వం హెల్ప్ డెస్క్, ప్రసాదం కూపన్ కౌంటర్, ప్రీపెయిడ్ ట్యాక్సీ బుకింగ్, స్వచ్ఛమైన శాకాహార భోజన శాల, ఏసీ రెస్ట్ ఏరియా, ఫ్రీ వైఫై వంటి సదుపాయాలు కల్పించారు. అంతేకాకుండా, ప్రయాణికులకు విమానాల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు 'ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్'ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.
ശബരിമല തീർഥാടകർക്കായി നവീകരിച്ച പമ്പ-ചാലക്കയം റോഡ് തുറന്നുകൊടുത്തു. 15 കോടി രൂപ ചിലവിൽ 4.5 കി.മീ റോഡ് വെറും ഒരു മാസം കൊണ്ടാണ് ആധുനിക നിലവാരത്തിൽ യാഥാർഥ്യമാക്കിയത്. സർക്കാരിന്റെ ഇച്ഛാശക്തിയുടെ മികച്ച ഉദാഹരണമാണിത്.റെക്കോർഡ് വേഗത്തിൽ ഈ ചരിത്രനേട്ടം സ്വന്തമാക്കിയ പൊതുമരാമത്ത് വകുപ്പിനും മന്ത്രി ശ്രീ. പി.കെ. ബഷീറിനും ഹൃദയം നിറഞ്ഞ അഭിനന്ദനങ്ങൾ. ഉദ്ഘാടനച്ചടങ്ങിൽ അധ്യക്ഷത വഹിച്ച ദേവസ്വം മന്ത്രി ശ്രീ. കെ. മുരളീധരനും ഈ പദ്ധതിക്ക് പിന്നിൽ പ്രവർത്തിച്ച എല്ലാവർക്കും ആശംസകൾ. പൊതുഖജനാവിന് അധിക ബാധ്യതയില്ലാതെ പദ്ധതികൾ വേഗത്തിൽ തീർക്കുന്നതിന് ഇതൊരു മാതൃകയാണ്.The newly renovated Pamba-Chalakkayam road is now open for Sabarimala pilgrims. Upgraded to modern standards across 4.5 km at ₹15 Cr, it was completed in one month, a testament to the government's willpower.Congratulations to the and Minister P.K. Basheer(Minister, Public Works Department ) for this historic achievement in record time. Best wishes to K. Muraleedharan (Minister, Devaswoms) everyone involved in making it a model for timely, cost-effective infrastructure development.#VDSatheesan#Sabarimala
— V D Satheesan (@vdsatheesan) November 16, 2026














Click it and Unblock the Notifications
