ఏపీలో ఈ నెల 26న సెలవు- ఈ 23 కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో..!

ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 26న రాష్ట్రంలోని నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు, మరో 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్య సంస్థలకు ప్రభుత్వం (AP Govt) ఈ నెల 26న సెలవు (Holiday) ప్రకటించింది. అలాగే ప్రైవేటు ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేస్తోంది.

టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధుల ప్రకటన..! లిస్టులో వీరే..!
టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధుల ప్రకటన..! లిస్టులో వీరే..!

రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడతలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండో విడతలో 23 చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు ఆముదాలవలస, అల్లూరు, రాజాం, బి. కొత్తపేట, తాడిగడప, భీమవరం, తణుకు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, గుడివాడ,, చింతలపూడి, నరసరావుపేట, పొన్నూరు, బాపట్ల, కందుకూరు, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఈ నెల 26న ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

AP Govt Declares November 26 Holiday in 23 Urban Local Bodies Due to Municipal Polls
AP 12th PRC: ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విధివిధానాల విడుదల..! డెడ్ లైన్ ఇదే..!
AP 12th PRC: ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విధివిధానాల విడుదల..! డెడ్ లైన్ ఇదే..!

దీంతో ఈ నెల 26న ఈ 23 చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇతర విద్యాసంస్దలు, వాణిజ్య సంస్థలకు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. వాణిజ్య సముదాయాలు తమ ఉద్యోగులకు నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ చట్టం ప్రకారం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ శాఖల వాహనాలను పోలింగ్ అవసరాల కోసం ప్రభుత్వానికి అప్పగించాలని కూడా ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో పోలింగ్ రోజు స్వేచ్ఛగా ఓటింగ్ జరిగేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+