రేపే తిరుమలలో కార్తీక పర్వ దిపోత్సవం: గరుడ సేవ రద్దు

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 84,014 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 30,116 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.28 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.

రేపు.. కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటన్నింటినీ పూర్తి చేసింది. కార్తీక పౌర్ణమి నాడు తిరుమలలో దీపాలను వెలిగించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అదనపు లడ్డూలను సిద్ధం చేస్తోంది.

Salakatla Karthika Parva Deepotsavam will be observed in the Tirumala Temple on November 24

కార్తీక పౌర్ణ‌మి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు.

తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే
తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే

ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను వెలిగిస్తారు.

టీటీడీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కమిటీ
టీటీడీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కమిటీ

ఈ కార్తీక పర్వ దిపోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించే గరుడ సేవను కూడా రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి పౌర్ణమికీ ఈ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+