వైఎస్ షర్మిలను యెలహంక ప్యాలెస్‌ లోకి రాకున్న అడ్డుకున్న పోలీసులు.. టెన్షన్.. టెన్షన్..

బెంగళూరులోని జగన్ నివాసం ఉన్న యెలహంక ప్యాలెస్‌ లోకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రవేశం లేదని కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన‌ నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. షర్మిల ఇవాళ సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు బెంగళూరు పోలీసులు అలెర్ట్ అయ్యారు.

షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ఎవరూ యెలహంక ప్యాలెస్‌ లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ మేరకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిని బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్రాస్ వద్ద నిలువరించారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నివాసానికి వెళితే తప్పు ఏంటి అని పోలీసులను ప్రశ్నించారు. ఆ సమయంలో కారులో వైఎస్ రష్మిలతో పాటు తల్లి విజయమ్మ, కుమారుడు, కోడలు ఉన్నారు.

YSSharmila latest Police prevented APCC Chief Y S Sharmila Reddy from entering Yelahanka Palace

ఇక యెలహంక ప్యాలెస్‌ లోకి ప్రవేశించకుండా పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో చివరకు వైఎస్ షర్మిక ఓ ప్రైవేట్ హోటల్ కు బయల్దేరారు. మరోవైపు షర్మిల బెంగళూరుకు వస్తున్న విషయంలో పోలీసులు ముందుగానే విమానాశ్రయం, యలహంక వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్యాలెస్‌ లోకి వైఎస్ షర్మిల ఫ్యామిలీ ప్రవేశించకుండా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేప‌థ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఇదిలాఉంటే యలహంక ప్యాలెస్‌ వివాదంపై సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున భీమిశెట్టి రమేష్‌ బాబు కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+