రష్మిక మందాన్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. చివరి నిమిషంలో వాయిదా..
నేషనల్ క్రష్ రష్మిక మందాన్న వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటిస్తూ నార్త్.. సౌత్ అని తేడా లేకుండా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఈ ఏడాది వివాహం చేసుకున్న రష్మిక వెంటనే విజయ్ తో కలిసి రణబాలి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవి శంకర్ నిర్మించారు.
ఇక ఈ మూవీ తర్వాత ప్రస్తుతం మైసా అనే మూవీ చేస్తున్నారు రష్మిక. అయితే మైసా మూవీని తొలుత నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే తాజాగా మైసా మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మైసా మూవీకి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ వచ్చేంత వరకూ మూవీలోని ఓసే రాములమ్మ పాటను ఎంజాయ్ చేయాలని చిత్ర యూనిట్ పోస్టు పెట్టింది.

ఇక మైసా చిత్రానికి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అన్ ఫార్ములా ఫిల్మ్స్, టీ-సిరీస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న గోండు తెగకు చెందిన యువతిగా కనిపించనున్నారు. ఇందులో రాహుల్ రవీంద్రన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై అనిల్, అజయ్ సయ్యపు రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.












Click it and Unblock the Notifications
