బ్రీజా కారు ఇవ్వలేదని.. పెళ్లి రద్దు చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్.. ఏమైందంటే..?
పెళ్లి అనగానే కట్నాలు.. కానుకలు.. పెట్టిపోతలు ఉండటం సహజమే. అయితే తనకు బ్రీజా కారు ఇవ్వలేదని ఓ పోలీస్ కానిస్టేబుల్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. హరియాణాలోని సోనిపట్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. తమ ఆర్థిక స్థోమత సరిగా లేదని బ్రీజా కారుకు బదులుగా హుండాయ్ ఆరాను తీసుకొచ్చారు. దీని ధరు రూ. 8 నుంచి 9 లక్షలు ఉంటుంది. అయితే ఈ కారును వరుడు తిరస్కరించాడు. మరోవైపు ఈ ఘటనపై పెళ్లి కుమార్తె తండ్రి శుభమ్ కుమార్.. సోనిపట్ లోని సెక్టార్ 27 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వరుడు, అతని తల్లి, సోదరుడు, ఇదరు మధ్యవర్తులపై వరకట్న వేధింపుల కేసును నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీ పోలీస్ విభాగంలో కుల్దీప్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు రిటైర్డ్ అధికారి సుభాష్ కుమార్తె హీనాతో పెళ్లి నిశ్చయం అయింది. ఇద్దరు మధ్యవర్తులు ఈ వివాహాన్ని కుదుర్చారు. ఇక రింగ్ సెరమనీ ఏప్రిల్ 26 న పూర్తయింది. ఇక వివాహం ఈ నెల 20 న వివాహం నిశ్చయమైంది. ఇక కట్నం కింద తనకు రూ.13 లక్షలు విలువ చేసే బ్రెజా కారు కావాలని కుల్దీప్ డిమాండ్ చేశాడు. కారుతో పాటు 2 తులాల బంగారు గొలుసు, తల్లికి 4 తులాల బంగారు చెవిదిద్దులు, ఇతర కుటుంబ సభ్యులకూ ఆభరణాలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు.

కానీ.. సమయం లేకపోవడం, అలాగే వధువు కుటుంబం తమ ఆర్థిక స్తోమత మేరకు రూ. 9.5 లక్షల విలువైన Hyundai Aura కారు బుక్ చేశారు. నవంబర్ 20న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందే తనకు ఆ కారు నచ్చలేదని, బ్రీజా కారునే కావాలని డిమాండ్ చేశాడు. దాంతో అప్పటికే బుక్ చేసిన AURA కారుని రద్దు చేసి బ్రీజా కోసం ప్రయత్నించినా.. సమయం లేకపోవడంతో ఏర్పాటు చేయలేకపోయారు. అయితే పెళ్లి రోజు బ్రీజా కారు సిద్ధం కాలేదని తెలియడంతో.. పెళ్లి రద్దు చేసుకొని వరుడు కుల్దీప్ కుటుంబంతో కలిసి వెనుదిరిగాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ.25-రూ.30 లక్షల దాకా ఖర్చు అయిందని హీనా తండ్రి సుభాష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
