Ind vs NZ: న్యూజీలాండ్ లో టీమిండియా మరో చరిత్ర- 96 ఏళ్లలో ఇదే తొలిసారి..!
భారత్-న్యూజీలాండ్ మధ్య వెల్టింగ్టన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (India) రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే టాప్ ఆర్డర్ లో ఐదుగురు బ్యాటర్లు కనీసం 5 అర్ధసెంచరీలు సాధించి 91 ఏళ్ల రికార్డును తిరగరాశారు. అనంతరం ఇవాళ టీమిండియా మరో సంచలన రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించడం ద్వారా టీమిండియా ఈ అరుదైన రికార్డును అందుకుంది. దీంతో 96 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ ఫీట్ నమోదైంది.
వెల్లింగ్టన్ టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా 9 వికెట్లకు 720 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తద్వారా 2019లో హ్యామిల్టన్ లో బంగ్లాదేశ్ పై కివీస్ చేసిన 715/6 డిక్లేర్డ్ రికార్డును తిరగరాసింది. ఇది న్యూజీలాండ్ లో జరిగిన టెస్టుల్లో ఓ జట్టు ఓ ఇన్నింగ్స్ లో సాధించిన అత్యధిక స్కోరుగా నిలిచింది. అలాగే ఇది 19వ అత్యధిక ఇన్నింగ్స్ స్కోరుగా కూడా నమోదైంది. 1997లో భారత్ పై శ్రీలంక 6 వికెట్లకు 952 పరుగులతో సృష్టించిన రికార్డు ఇప్పటికీ టాప్ లో ఉంది.

మరోవైపు 1930లో న్యూజీలాండ్ తమ తొలి టెస్టు ఆడినప్పటి నుంచీ ఆ దేశంపై ఏ జట్టు అయినా చేసిన 700కు పైగా స్కోరు కూడా ఇదే . గతంలో 1995లో వెల్లింగ్టన్ లో 5 వికెట్లకు 660 పరుగులు చేసిన వెస్టిండీస్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇప్పుడు భారత్ చేసిన 720 పరుగుల స్కోరుతో బద్దలైనట్లయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో చేసిన ఈ భారీ స్కోరుకు సమాధానంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఇవాళ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. తద్వారా ఇంకా భారత్ కంటే 233 పరుగులు వెనుకబడి ఉంది. రేపు 8 వికెట్లను కాపాడుకుంటూ కివీస్ ఈ స్కోరు దాటకపోతే ఇన్నింగ్స్ పరాజయం తప్పదు.














Click it and Unblock the Notifications
