ఈ దొంగలు మామూళోళ్లు కాదు.. కారు టెయిల్ లైట్ వెనుక.. రూ.3.83 కోట్ల బంగారం దాచి..

కోల్‌ కతా నుంచి హైదరాబాద్‌ కు కారులో అక్రమంగా తరలిస్తున్న 2.98 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.83 కోట్లు ఉంటుందని హైదరాబాద్ జోనల్ యూనిట్ డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అంతకుముందే ఉన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు కోల్ కతా నుంచి హైదరాబాద్ మార్గంలో వస్తున్న ఓ ఎస్ యూవీ వాహనాన్ని అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. వాహనాన్ని నిశితంగా పరిశీలించగా కారు వెనుక భాగంలోని టెయిల్ లైట్ వెనుక ప్రత్యేకంగా తయారు చేసిన ఒక రహస్య అరను అధికారులు గుర్తించారు.

Gold worth Rs 3 83 crore seized from behind car tail light vehicle traveling Kolkata to Hyderabad

ఆ సీక్రెట్ ఛాంబర్ ను ఓపెన్ చేయగా.. బ్రౌన్ కలర్ అడెసివ్ టేప్ తో చుట్టిన మూడు ప్యాకెట్లు దొరికాయి. అయితే వాటిని తెరిచి చూడగా 2.98 కిలోల బరువున్న 25 బంగారం కడ్డీలు బయటపడ్డాయి. ఇది స్వచ్ఛమైన బంగారమని.. మార్కెట్‌ లో దీని విలువ సుమారు రూ.3.83 కోట్లు ఉంటుందని సమాచారం. కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం బంగారంతోపాటు స్మగ్లింగ్ కోసం వినియోగించిన ఎస్ యూవీ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. అంతేకాక ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+