హైదరాబాద్ కు ఉగ్రదాడి బెదిరింపు మెయిల్.. పోలీసులు అలర్ట్.. కీలక సూచనలు..!
26/11 ముంబై ఉగ్రదాడి తరహాలోనే హైదరాబాద్ లోనూ బాంబులు పేలుతాయంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం సృష్టిస్తోంది. లష్కర్ ఏ తోయిబా పేరుతో హైదరాబాద్ పోలీసులకు గుర్తు తెలియని దుండగులు మెయిల్ చేశారు. కాచిగూడ రైల్వేస్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద బాంబు పేలుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కనీసం 300 మందిని చంపడమే లక్ష్యమని అందులో బెదిరించారు.
అయితే ఈ మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో యాంటీ సబోటేజ్ చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో నిఘా, గస్తీ పెంచారు. మెయిల్ వెనక ఉన్న వ్యక్తుల గుర్తింపునకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ప్రజలు వదంతులు నమ్మొద్దని.. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే 112 కు సమాచారం ఇవ్వాలని సూచనలు చేశారు. బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో స్పెషల్ బ్రాంచ్ నుంచి నగర పోలీసులకు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్లింది.

మరోవైపు ఇలాంటి ఫేక్ వదంతులను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు 24 గంటలూ అందుబాటులో ఉన్నారని భరోసా కల్పించారు.












Click it and Unblock the Notifications
