'రామాయణ' మూవీ సంచలనం.. మరో అరుదైన రికార్డు కైవసం..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న మూవీ 'రామాయణ'.. నార్త్.. సౌత్ అని తేడా లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో అలాగే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తోంది. ఈ మేరకు మూవీ దీపావళి కానుకగా నవంబర్ 5 న విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ నుంచి ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతోంది.

భారత్​ లోనే కాదు ఈ చిత్రానికి ఓవర్సీస్ లోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే రామాయణ మూవీ తాజాగా మరో ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మరో ఘనత సాధించింది. తాజాగా రామాయణ మూవీ రూ.1600 కోట్ల వసూళ్లను క్రాస్ చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అలాగే భారత్ లో ఆదివారం నాటికి రూ. 1,084 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో రూ. 907 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాగా.. ఓవర్సీస్ మార్కెట్లలో మరో రూ. 567 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

ఇక రామాయణ మూవీకి హిందీ బెల్ట్ నుంచి అత్యధికంగా వసూళ్లు వస్తున్నాయి. 18 రోజుల్లో కేవలం హిందీ వెర్షన్‌ లోనే రామాయణ మూవీకి రూ. 700 కోట్ల నెట్ వసూళ్లను దాటినట్లు సమాచారం. ఇక మిగతా భాషల విషయానికి వస్తే తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రామాయణ మూవీ రూ.250 కోట్లు వసూల్ చేసింది. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Ramayana creates a sensation at the box office collects Rs 1 000 crore in India alone movie news

ఇక ఈ మూవీలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించారు. ఆయనతోపాటు సాయి పల్లవి, యష్, సన్నీ దేఓల్, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, ఆదినాథ్ కొఠారే, అరుణ్ గోవిల్, కునాల్ కపూర్, లారా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+