జగన్ ఓ పెద్ద క్రెడిట్ చోర్- నారా లోకేష్

ఏపీలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన పారిశ్రామిక పురోగతిపై బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కోర్టులకెక్కిన జగన్ కు ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి క్రెడిట్ తమదేనని చెప్పుకొంటోన్నారని విమర్శించారు.

ఈ రెండున్నరేళ్ల వ్యవధిలో దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తరలివచ్చాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ సంస్థలు రూ.1,33,000 లక్షల కోట్ల చొప్పున భారీ ప్రాజెక్టులతో ముందుకు వచ్చాయని తెలిపారు. వీటితో పాటు బ్రూక్‌ఫీల్డ్ సంస్థ రూ. 1,06,000 కోట్లు, రిలయన్స్ రూ. 43,000 కోట్లు, రెన్యూ రూ. 22,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయని, వీటి ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ట్వీట్ చేశారు.

IT Minister Nara Lokesh has challenged YS Jagan to a debate on investments jobs and development

జగన్ హయాంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని నారా లోకేష్ విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రానికి తెస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికీ కోర్టుల్లో పిటిషన్లు వేస్తోన్నారని, తీరా ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కిన తర్వాత వాటి క్రెడిట్ తమదేనంటూ ప్రచారం చేసుకుంటోన్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్క పెట్టుబడి కూడా రాలేదంటూ ఖాళీ ఏపీ మ్యాప్ ను నారా లోకేష్ తన ట్వీట్ కు జత చేశారు.

పాకిస్తాన్- ఏ చేతిలో టీమిండియా పరాజయం: తిలక్ వర్మ సెంచరీ చేసినా.. !!
పాకిస్తాన్- ఏ చేతిలో టీమిండియా పరాజయం: తిలక్ వర్మ సెంచరీ చేసినా.. !!

పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, రాష్ట్రాభివృద్ధి.. వంటి కీలక అంశాలపై నాటి పాలకులు సాధించింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని దెబ్బతీశారంటూ వైఎస్ఆర్సీపీ చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో నారా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెట్టుబడుల సాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.

గత అయిదేళ్ల పాలన, ప్రస్తుత కూటమి పాలనకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని, దీన్నిఅడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రాధాన్యత ఇస్తోందని నారా లోకేశ్ చురకలు అంటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉపాధి కల్పనపై వైకాపాకు చిత్తశుద్ధి ఉంటే తమ సవాలును స్వీకరించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+