పాకిస్తాన్- ఏ చేతిలో టీమిండియా పరాజయం: తిలక్ వర్మ సెంచరీ చేసినా.. !!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో భారత్-ఏ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్- ఏ జట్టు ఏకంగా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. 314 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.1 ఓవర్లలో 265 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. కేప్టెన్ తిలక్ వర్మ సెంచరీ సాధించినప్పటికీ.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

ఛేజింగ్ ప్రారంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 11 పరుగులకే అవుట్ అయ్యాడు. మహ్మద్ ఇమ్రాన్ రంధావా బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు. అతని తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఆయుష్ బదోని డకౌట్ కావడంతో 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.. ఒత్తిడికి లోనైంది. మరో ఎండ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ విరుచుకుపడ్డాడు. స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.

Hasan Nawaz all-round show trumps Tilak Varma ton as Pakistan A seal win with 48 runs on India A

హసన్ నవాజ్ బౌలింగ్ లో అబ్దుల్ సమద్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్ మళ్లీ మొదటికొచ్చింది. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కుమార్ కుశాగ్ర- 2, రింకూ సింగ్- 6, సూర్యాంశ్‌ షెడ్గే- 3 తక్కువ పరుగులకే వెనుతిరగడంతో భారత్ 129 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో కెప్టెన్ తిలక్ వర్మ, లోయర్ ఆర్డర్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్ కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.

రేపే తిరుమలలో కార్తీక పర్వ దిపోత్సవం: గరుడ సేవ రద్దు
రేపే తిరుమలలో కార్తీక పర్వ దిపోత్సవం: గరుడ సేవ రద్దు

దీంతో మ్యాచ్‌పై ఆశలు చిగురించాయి. షాబాజ్ అహ్మద్ 49 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 54 పరుగులు చేశాడు. అలీ రజా బౌలింగ్ లో షాబాజ్ అహ్మద్ అవుట్ అయ్యాక ఇక ఇన్నింగ్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. విప్రాజ్ నిగమ్- 0, హర్షిత్ రానా- 0, ప్రిన్స్ యాదవ్- ఒక పరుగు (నాటౌట్) చేశారు. తిలక్ వర్మకు సహకరించే బ్యాటర్లెవరూ లేకపోవడంతో ఓటమి తప్పలేదు. 149 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సరిగ్గా 100 పరుగులు చేసిన తిలక్ వర్మ చివరి బ్యాటర్ గా అవుట్ అయ్యాడు. దీంతో 265 పరుగుల వద్ద భారత ఇన్నింగ్ కు తెరపడింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో

పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా, హసన్ నవాజ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా క్రమం తప్పకుండా వికెట్లు తీసి భారత విజయావకాశాలను దెబ్బతీశారు. హసన్ నవాజ్, అలీ రజా మూడేసి వికెట్లు పడగొట్టారు. రంధావా- 2, అహ్మద్ డేనియల్, సూఫియాన్ మొకిమ్ ఒక్కోక్క వికెట్ పడగొట్టారు. అంతకుముందు హసన్ నవాజ్ 79 పరుగులు చేశాడు. ఇన్నింగ్ టాప్ స్కోరర్ అతనే. మొదట బ్యాటింగ్ లో, అనంతరం బౌలింగ్ లో రాణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+