బిస్లెరీ ఎంతమాత్రం సేఫ్ కాదు..: FSSAI

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ సంస్థ బిస్లెరీ ఇంటర్నేషనల్‌కు షాక్ ఇచ్చింది.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ. చట్టపరంగా కఠిన చర్యలకు దిగింది. బిస్లెరీ నుంచి సేకరించిన తాగునీటి శాంపిల్స్.. ల్యాబ్ టెస్ట్ లో విఫలం అయ్యాయి. వినియోగానికి ఎంత మాత్రం సురక్షితం కాదని తేల్చింది. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం బిస్లేరీ ఇంటర్నేషనల్ పై కేసులను నమోదు చేసింది. చట్టపరమైన చర్యలను తీసుకుంటోంది.

బిస్లేరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్‌లో నిర్దేశిత పరిమితిని మించి 'బ్రోమేట్' అనే హానికర రసాయనం ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్వహించిన ల్యాబ్ టెస్టుల్లో నిర్ధారణ అయింది. దీన్ని బిస్లెరీ యాజమాన్యం కోర్టులో సవాల్ చేసింది. ఆ నీటి శాంపిల్‌ను తదుపరి పరీక్షల కోసం రెఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన తనిఖీల్లో సైతం నీటి శాంపిల్‌లో బ్రోమేట్‌తో పాటు 'పాలిన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్' కలిసినట్లు తేలింది.

FSSAI sanctioned prosecution against Bisleri after packaged drinking water sample was found unsafe

ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, అమెరికా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ వంటి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం బ్రోమేట్ గానీ, పాలిన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు గానీ క్యాన్సర్ కారకాలు. వాడుతున్న కొద్దీ ఇవి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తీసుకొచ్చే ప్రమాదకర కెమికల్ కాంపౌండ్స్. ఇవి బిస్లెరి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లో కలిసి ఉన్నాయని ఏకంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పాకిస్తాన్- ఏ చేతిలో టీమిండియా పరాజయం: తిలక్ వర్మ సెంచరీ చేసినా.. !!
పాకిస్తాన్- ఏ చేతిలో టీమిండియా పరాజయం: తిలక్ వర్మ సెంచరీ చేసినా.. !!

బిస్లేరీకి చెందిన ఏ వేరియంట్ వాటర్ బాటిల్ శాంపిల్ లో ఇవి కలిశాయనే వివరాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బహిరంగంగా వెల్లడించలేదు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కేటగిరీ నుంచే ఈ శాంపిల్స్ సేకరించినట్లు స్పష్టం చేసింద. బిస్లేరీ ఇంటర్నేషనల్ కంపెనీకి మాత్రమే ఈ చర్యలు పరిమితం కావట్లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో విఫలమైన మరికొన్ని ప్రముఖ ఆహార తయారీ సంస్థలపై కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కఠిన చర్యలు చేపట్టింది.

జగన్ ఓ పెద్ద క్రెడిట్ చోర్- నారా లోకేష్
జగన్ ఓ పెద్ద క్రెడిట్ చోర్- నారా లోకేష్

వసంత్ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్ బిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిమాంస ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ వంటి సంస్థలపై ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చింది. వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన ఉర్మి లైఫ్‌ సైన్సెస్ ఎల్‌ఎల్‌పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ వంటి సంస్థల వ్యాపార లైసెన్సులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

ఆశా కన్ఫెక్షనరీ తయారు చేసిన చాక్లెట్ ఫిల్డ్ కుకీలు సురక్షితం కాదని తేలడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రొడక్ట్ రీకాల్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచిన ఆ కుకీల ప్యాకెట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+