'మెగావర్స్’ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ - చిరంజీవి పేరులో 'N' మాయం వెనుక..!!

మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వేదికపై సరికొత్త లుక్ లో ముందుకొస్తున్నారు. ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ టాక్ షో 'మెగావర్స్'కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ టాక్ షో లాంఛ్ డేట్ కు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. ప్రముఖులతో ముచ్చ టించే ఈ టాక్ షో లాంచ్‌ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ షో ప్రమోషన్లలో చిరంజీవి పేరు లో 'N' లేకుండా కనిపిస్తుండటం వెనుక కారణాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

వాట్సాప్ గ్రూపులో చిరంజీవి, బాలయ్య
వాట్సాప్ గ్రూపులో చిరంజీవి, బాలయ్య

మెగాస్టార్ సరి కొత్త రూపంలో ఓటీటీ వేదికగా అభిమానుల ముందుకు వస్తున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 30న సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ లో ఈ లాంఛ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేలా నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసినట్లు ఏర్పాట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఈవెంట్ మరో లెవల్ లో ఉండటం ఖాయంగా కనిపి స్తోంది.

Megastar Chiranjeevi s OTT Talk Show Megaverse Launch Date Goes Viral details here

ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజ రు కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 'CHIRA_JEEVI' పేరుతో భారీ హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. ఈ షోకు సంబంధించిన తొలి ప్రోమో అతి త్వరలోనే విడుదలకు రంగం సిద్దం అవుతోంది. ఈ ఈవెంట్లోనే మెగావర్స్ షో ఫార్మాట్, ఎపిసోడ్ల వివరాలు, స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేస్తారని టాక్.

'కాకా' మూవీపై లీక్ ఇచ్చిన చిరంజీవి.. సోషల్ మీడియా షేక్
'కాకా' మూవీపై లీక్ ఇచ్చిన చిరంజీవి.. సోషల్ మీడియా షేక్

కాగా, మెగావర్స్ షో షూటింగ్ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా స్పీడ్ గా జరుగుతోంది.చిరంజీవి టాక్ షో మెగావర్స్ గెస్ట్ ల లిస్టు లో కమల్ హాసన్, నాగార్జునలతో పాటు ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని, హాస్యనటులు బ్రహ్మానందం, సత్య తదితరులు కనిపించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పలు టెలివిజన్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మెప్పించిన చిరంజీవి, తొలిసారి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై టాక్ షో చేయనుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.

డిసెంబర్ 13 నుంచి ఈ షో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. దీంతో ఈ టాక్ షో నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ షో ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ లో చిరంజీవి పేరు లొ 'N' మిస్ అయింది. నెట్ ప్లిక్స్ కావటంతో 'N' లేకుండా కొత్త తరహా ప్రచారం చేస్తున్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. 'N' మిస్ కావటం వెనుక కొత్త చర్చలు వినిపిస్తు న్నాయి. కాగా, దీని వెనుక అసలు కారణం ఏంటనేది లాంఛింగ్ రోజున స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+