భారత్ నుంచి రాగానే షేక్ హసీనాకు ఉరిశిక్ష..? బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక చర్చలు..!

రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన ఉద్యమంలో విద్యార్దులను కాల్చిచంపాలనే ఆదేశాలు ఇచ్చి, ఆ తర్వాత తిరుగుబాటుతో పదవీచ్యుతురాలై భారత్ కు వచ్చి తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే నెలలో స్వదేశం వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు గతంలో ప్రకటించిన విధంగా బంగ్లాదేశ్ కు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్న షేక్ హసీనాకు అక్కడి ప్రధాని తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ప్రభుత్వం షాకిచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఆమె దాఖలు చేసుకున్న పాస్ పోర్టు విజ్ఞప్తిని తోసిపుచ్చిన బంగ్లాదేశ్.. భారత్ ను ఆమెకు తమకు అప్పగించాలని కోరింది.

బంగ్లాదేశ్ రిటర్న్ కు సిద్దమైన హసీనా..! తొలి అడుగు..! అంతలోనే ట్విస్ట్..!
బంగ్లాదేశ్ రిటర్న్ కు సిద్దమైన హసీనా..! తొలి అడుగు..! అంతలోనే ట్విస్ట్..!

ఓవైపు ఎలాగైనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు షేక్ హసీనా (Sheikh Hasina ) చేస్తున్న ప్రయత్నాలు, అదే సమయంలో ఆమె రాకను స్వాగతిస్తూ తన సొంత పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు చేస్తున్న రచ్చ అన్నీ అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేస్తున్నాయి. ఇప్పటికే విద్యార్దుల హత్యలకు బాధ్యతగా దోషిగా నిర్దారణ అయిన హసీనాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉరిశిక్ష విధించాలనే ఒత్తిడి అక్కడి ప్రభుత్వంపై పెరుగుతోంది. ఈ దిశగా ఇవాళ విపక్షంలోని విద్యార్దుల పార్టీ ఎన్సీపీ ప్రతినిధులు ఇవాళ ప్రధాని తారిఖ్ రహ్మాన్ తో భేటీ అవుతున్నారు. 2024లో జరిగిన ఆందోళనల్లో విద్యార్దుల్ని పొట్టనపెట్టుకున్న హసీనాకు ఉరిశిక్ష విధించాలని వారి పార్టీ ప్రధానిని కోరబోతోంది.

Sheikh Hasina s Death Sentence NCP to Press Tarique Rahman for Early Implementation in Bangladesh
Sheikh Hasina: హసీనా అప్పగింతకు భారత్ కీలక షరతులు..! సైనిక విమానం, ఆర్మీ ఆహ్వానం?
Sheikh Hasina: హసీనా అప్పగింతకు భారత్ కీలక షరతులు..! సైనిక విమానం, ఆర్మీ ఆహ్వానం?

వాస్తవానికి ఇవాళ ప్రధానితో భేటీలో ఈ అజెండా అంశం లేనప్పటికీ విద్యార్ధుల పార్టీ ప్రతినిధులు మాత్రం హసీనా రాగానే వెంటనే మరణశిక్ష అమలుకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్సీపీ హసీనాకు త్వరగా మరణశిక్ష అమలు సహా నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. దీన్ని ఆయన కూడా విస్మరించే పరిస్ధితి లేదు. హసీనా రాకకు ముందే అధికార, విపక్ష పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసులపై ఆమె పార్టీ అవామీలీగ్ కార్యకర్తల దాడుల నేపథ్యంలో.. దేశాన్ని అస్ధిరపరిచేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని ప్రధాని తారిక్ రహ్మాన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ ప్రతినిధులతో ఆయన భేటీ అవుతున్నారు. దీంతో ఎన్సీపీ డిమాండ్లపై ప్రధాని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమా, లేక దాన్ని పట్టించుకోకుండా మరోసారి హసీనా తరహాలో విద్యార్ధుల ఆగ్రహం చవి చూడటమా అనేది ఆయన చేతుల్లోనే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+